రాజరాజేశ్వరి అమ్మవారి దీక్ష చేపట్టిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు నగరంలోని దుర్గామిట్టలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి.అందులో భాగంగా అమ్మవారి దీక్ష చేపట్టారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

 Mla Kotamreddy Sridhar Reddy Rajarajeswari Ammavari Deeksha, Mla Kotamreddy Srid-TeluguStop.com

శ్రీ రాజరాజేశ్వరి సేవాసమితి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఎమ్మెల్యే కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.గోపూజ చేసిన తర్వాత అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీధర్ రెడ్డికి ఆలయ ప్రధానార్చకులు మాలాధారణ చేశారు.

భక్తులతో కలిసి అమ్మవారి భజనా కార్యక్రమంలో పాల్గొన్నారు.5వ తేదీ వరకు అమ్మవారి దీక్షలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఉంటారు.ఇక దేవి శరన్నవరాత్రి ఉత్సవాలని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చేలా వైభవోపేతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు శ్రీధర్ రెడ్డి.26 వ తేది నుంచి 5 వ తేదీ వరకు ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉండి, ఉత్సవాలని వేడుకగా నిర్వహించనున్నారు.అలానే అష్టాదశ శక్తిపీఠాల అలంకారాలు ఈ సారి ఆలయంలో తాత్కాలికంగా ప్రతిష్టించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube