రాజరాజేశ్వరి అమ్మవారి దీక్ష చేపట్టిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
TeluguStop.com
నెల్లూరు నగరంలోని దుర్గామిట్టలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి.
అందులో భాగంగా అమ్మవారి దీక్ష చేపట్టారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
శ్రీ రాజరాజేశ్వరి సేవాసమితి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఎమ్మెల్యే కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
గోపూజ చేసిన తర్వాత అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీధర్ రెడ్డికి ఆలయ ప్రధానార్చకులు మాలాధారణ చేశారు.
భక్తులతో కలిసి అమ్మవారి భజనా కార్యక్రమంలో పాల్గొన్నారు.5వ తేదీ వరకు అమ్మవారి దీక్షలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఉంటారు.
ఇక దేవి శరన్నవరాత్రి ఉత్సవాలని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చేలా వైభవోపేతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు శ్రీధర్ రెడ్డి.
26 వ తేది నుంచి 5 వ తేదీ వరకు ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉండి, ఉత్సవాలని వేడుకగా నిర్వహించనున్నారు.
అలానే అష్టాదశ శక్తిపీఠాల అలంకారాలు ఈ సారి ఆలయంలో తాత్కాలికంగా ప్రతిష్టించనున్నారు.
తేజ సజ్జా ‘మిరాయ్’ మూవీతో భారీ సక్సెస్ ను సాధిస్తాడా..?