గురుకుల పాఠశాల/కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ ( Miryalaguda )పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలను ఎంఈఓ కలసి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి( Mla Bathula Laxma Reddy ) మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు.

హాస్టల్ లో ఉదయం పెట్టే అల్పాహారం చూసి నాణ్యత లేకుండా ఎలాంటి పోషకాలు లేని ఇలాంటి అల్పాహారం విద్యార్థులకు పెడుతున్నారా అంటూ హాస్టల్ సిబ్బందిపై మరియు ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిరోజూ ఉదయం పెట్టే అల్పాహారం లిస్ట్ మరియు ఈరోజు అల్పాహారంలో ఉపయోగించిన వస్తువుల లిస్ట్ వెంటనే నాకు వివరణ ఇవ్వాలని సూచించారు.అనంతరం హాస్టల్ పరిసరాలు తిరిగి విద్యార్థులతో మాట్లాడారు.

హాస్టల్ లో టాయిలెట్స్ శుభ్రంగా లేవని, ఇలా ఉండటం మూలాన దోమలు అధికమై విద్యార్థులు రోగాల బారినపడే అవకాశాలు ఉన్నాయని,వెంటనే వాటిని శుభ్రపరచి ప్రతిరోజూ సానిటైజేషన్ చేయాలని హెచ్చరించారు.అనంతరం విద్యార్థులతో కలిసి ఉదయం ప్రేయర్ లో పాల్గొని సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మీరు మంచి విద్యను నేర్చుకొని మీ తల్లి తండ్రులు గర్వపడే విధంగా అభివృద్ధి చెందాలని కోరారు.నేను రాజకీయాలు చేయడానికి వచ్చిన రాజకీయ నాయకుణ్ణి కాదని,నేను అప్పుడైనా, ఇప్పుడైనా,ఎప్పుడైనా ఒక సామాజిక కార్యకర్తని మాత్రమనని,విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు.

Advertisement
ప్రజల సమస్యలే నా ఎజెండా : దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్

Latest Nalgonda News