పిల్లల్లో ఎముకలు దృఢంగా ఉండాలంటే కచ్చితంగా వీటిని వారికి ఇవ్వాల్సిందే!

పిల్లల ఆరోగ్యమైన జీవితంలో దృఢమైన ఎముకలు కీలక పాత్ర పోషిస్తాయి.చిన్న తనంలో పిల్లల ఎముకల ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి.

 Children Should Have These Foods To Keep Their Bones Strong! Children, Bones, St-TeluguStop.com

వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి.ఎముక సాంద్రత తగ్గుతుంది మరియు వయస్సు యొక్క క్షీణత ప్రభావం అస్థిపంజర వ్యవస్థ పై పడుతుంది.

అందుకే చిన్నతనం నుంచి పిల్లల్లో దృఢమైన, బలమైన ఎముకలను నిర్మించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలి.

Telugu Drumstick, Healthy, Latest, Superfoods-Telugu Health

అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు చాలా బాగా సహాయ పడతాయి.ఈ జాబితాలో మునగాకు( Drumstick leaves ) ఒకటి.మునగాకు లో పుష్కలంగా ఉండే క్యాల్షియం పిల్లల్లో ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది.

అందువల్ల వారానికి రెండు సార్లు పిల్లల చేత మునగాకును తినిపించాలి.లేదా నిత్యం పాలల్లో మునగాకు పొడి కలిపి వారి చేత తాగించాలి.

Telugu Drumstick, Healthy, Latest, Superfoods-Telugu Health

అలాగే పిల్లల్లో బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే వారి చేత నిత్యం వ‌న్ టేబుల్ స్పూన్ నువ్వులను తినిపించాలి.లేదా రోజుకొక నువ్వుల లడ్డూను వారికి ఇవ్వాలి.ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు మరియు అవసరమైన ఖనిజాలతో నువ్వులు నిండి ఉంటాయి.అందువల్ల నువ్వులు ఎముకలకు మంచి బలాన్ని అందిస్తాయి.పిల్లల చేత నిత్యం ఒక కప్పు పెరుగు( Curd )ను తినిపించాలి.ఎముకలను దృఢంగా ఆరోగ్యంగా మార్చే విటమిన్ డి మరియు కాల్షియం పెరుగులో సహజంగా పుష్కలంగా ఉంటాయి.

తోటకూర, పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలు పిల్లల ఆహారంలో భాగం చేయాలి.వారానికి కనీసం ఒక్కసారైనా పిల్లలకు ఆకుకూర పెట్టాలి.

బలమైన ఎముకల నిర్మాణానికి ఆకుకూరలు మద్దతు ఇస్తాయి.ఇక డ్రై ఫ్రూట్స్ మరియు గింజలు కాల్షియం మరియు విటమిన్ డి యొక్క అద్భుతమైన వనరులు.

కాబట్టి పిల్లలకు ప్ర‌తి నిత్యం గుప్పెడు డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ ఇవ్వండి.వారి ఎముక‌ల‌ను బ‌లంగా మార్చండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube