తిక్కకుదిరింది: బలిసి కొట్టుకుంటున్న ఓ IASని సరిహద్దులకు ట్రాన్స్ ఫర్ చేసేసిన కేంద్రం?

అవును.మీరు విన్నది నిజమే.

బలిసి కొట్టుకుకుంటున్న ఓ IASని సరిహద్దులకు ట్రాన్స్ ఫర్ చేసేసిన కేంద్రం.బాధ్యతగా మెలగాల్సిన ఓ IAS అధికారి చేస్తోన్న నిర్వాకం దేశవ్యాప్తంగా ఇపుడు చర్చనీయాంశం అవుతోంది.

సాయంత్రం పూట త‌న కుక్క‌తో క‌లిసి వాకింగ్ చేయ‌డానికి ఏకంగా ఓ స్టేడియాన్ని అడ్డగోలుగా వాడేస్తున్నాడు ఓ IAS అధికారి.అతడు స్టేడియంలోకి వ‌చ్చే క్ర‌మంలో ముందుగానే అక్కడి అథ్లెట్లు, ఫుట్‌బాల్ క్రీడాకారులకు శిక్ష‌ణ‌ను ముంగించాల‌ని, లేదంటే బాగోదని వారిపై ఒత్తిడి తీసుకువ‌స్తున్నారు.

దీంతో అక్క‌డ ప్రాక్టిస్ చేయ‌డానికి వ‌స్తున్న క్రీడాకారులు, అథ్లెట్లు, కోచ్ లు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దేశ రాజ‌ధాని ఢిల్లీలో జరుగుతున్న బాగోతం తాజాగా వెలుగుచూసింది.

Advertisement

ఢిల్లీలోని త్యాగరాజ్‌ స్టేడియం సాధారణంగా సాయంత్రం 7 గంటలవరకు క్రీడాకారులు, శిక్షకులతో చాలా బిజీ ఉంటుంది.అయితే ఢిల్లీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) సంజీవ ఖిర్వార్‌ మాత్రం ఆ స్టేడియాన్ని తన పెంపుడు కుక్క మరియు భార్యతో వాకింగ్‌ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు.

ఇందుకోసం నిర్ణీత సమయం కంటే ముందే క్రీడాకారులను స్టేడియం నుంచి వెళ్లగొట్టాలని నిర్వాహకులకు సూచించారు.దీంతో సాయంత్రం 7 గంటలకంటే ముందు క్రీడాకారులు, శిక్షకులను బయటకు పంపిస్తున్నారు.

కొన్ని నెలలుగా IAS అధికారి చేస్తున్న నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

దాంతో IAS అధికారి చేస్తోన్న నిర్వాకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం వల్ల స్పందించింది ఢిల్లీ ప్రభుత్వం.రాత్రి 10 గంటల వరకు నగరంలోని స్టేడియాలన్నీ క్రీడాకారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా వెల్లడించారు.ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం స్టేడియాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై, సంజీవ ఖిర్వార్ దంపతుల​ను బదిలీ చేసింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

AGMUT క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్​ అధికారి ఖిర్వార్‌ను లద్దాఖ్​కు, ఆయన భార్య అను దుగ్గాలను అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ.ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు