బ్రష్ చేసేటప్పుడు ఈ త‌ప్పులు చేస్తే దంతాల‌కు ముప్పే.. జాగ్ర‌త్త‌!

దంతాలు మ‌రియు చిగుళ్లు.ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండాలీ అంటే ఖ‌చ్చితంగా బ్ర‌ష్ అవ‌స‌రం.

అలా అని ఎలా ప‌డితే అలా బ్ర‌ష్ చేస్తే.అనేక దంత స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అయితే చాలా మంది తెలిసో, తెలియ‌క‌నో బ్ర‌ష్ చేసే స‌మ‌యంలో కొన్ని కొన్ని త‌ప్పులు చేస్తుంటారు.ఆ త‌ప్పులే.

మ‌న‌కు ముప్పుగా మారుతుంటాయి.మ‌రి ఆ త‌ప్పులు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా తెలిసేసుకోండి.

Advertisement

సాధార‌ణంగా కొంద‌రు దంతాల‌ను తెల్ల‌గా, మిళ‌మిళా మెరిపించుకోవాలి అనే కుతూహలంతో ఎక్కువ స‌మ‌యం పాటు బ్ర‌ష్ చేస్తుంటారు.కానీ, ఇలా చేయ‌డం వ‌ల్ల క్ర‌మంగా దంతాలు పెలుసు బారి పోతుంటాయి.

అందుకే కేవ‌లం రెండు నుంచి మూడు నిమిషాలు మాత్ర‌మే ప‌ళ్ళు తోముకోవాలి.

అలాగే చాలా మంది టైమ్ లేద‌నో లేదా ఇత‌రిత‌క కార‌ణాల వ‌ల్ల వేగంగా, గ‌ట్టిగా, ఎలా ప‌డితే అలా బ్ర‌ష్ చేసుకుంటారు.దాంతో ప‌ళ్ల‌తో పాటు చిగుళ్లు కూడా దెబ్బ తింటాయి.కాబ‌ట్టి, ఇక‌పై సున్నితంగా బ్ర‌ష్ చేసుకోండి.

మ‌రియు రోజుకు రెండు సార్లు మించ‌కుండా బ్ర‌ష్ చేసుకోవాలి.రోజంతా వివిధ రకాల ఆహార పదార్థాలు తింటుంటారు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

కాబ‌ట్టి, వాటి రసాలు నాలుకపై ఉండిపోతాయి.అందువ‌ల్ల‌, ప‌ళ్ళు తోముకునేటప్పుడు నాలుకను కూడా టంగ్ క్లీనర్‌తో శుభ్రపరచుకోవాలి.

Advertisement

లేదంటే నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుంది.

చాలా మంది చేసే త‌ప్పు.టూత్ బ్ర‌ష్‌ను నెల‌లు త‌ర‌బ‌డి వాడ‌టం.ఇలా చేయ‌డం వ‌ల్ల బ్ర‌ష్ బ్రిసిల్స్ హార్డ్ గా మారిపోయి.

దంతాల‌ను, చిగుళ్ల‌ను డ్యామేజ్ చేసేస్తాయి.అందుకే రెండు నెల‌ల‌కు ఒక సారి త‌ప్ప‌కుండా బ్ర‌ష్ చేంజ్ చేయాలి.

ఇక కొంద‌రు బ్రష్ చేసిన వెంట‌నే బ్రేక్ ఫాస్ట్ చేసేస్తుంటారు.కానీ, బ్రష్ చేసిన అరగంట తరువాత బ్రేక్ ఫాస్ట్ చేయాలి.

అలాగే రాత్రి డిన్నర్ చేసిన అరగంట తరువాత బ్రష్ చేయాలి.లేదంటే పంటి మీద ఉన్న ఎనామిల్ పోతుంది.దాంతో ప‌ళ్ళు ప‌సుపు రంగులోకి మారి పోతాయి.

తాజా వార్తలు