మిస్ ఆస్ట్రేలియాగా భారత సంతతి యువతి..!!!

విదేశాలలో ఉంటున్న ఎంతో మంది ప్రవాస భారతీయ యువతులు తమ చక్కనైన అందం, ప్రతిభ, తెలివితేటలతో అందాల పోటీలలో గెలుపొందిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

తాజాగా భారత సంతతికి చెందిన ప్రియా సేరావో అనే యువతి మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా కిరీటాన్ని దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.

దాంతో ఈ ఏడాది జరగనున్న ప్రపంచ వ్యాప్త మిస్ యూనివర్స్ పోటీలలో ఆస్ట్రేలియా తరుపున పోటీ చేసే అవకాసం కలిగింది.ఇదిలాఉంటే ఈ పోటీలలో మొత్తం 26 మంది యువతులు పోటీ పడగా సెరావో అందరిని వెనక్కి నెట్టి మరీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది.

ప్రియా సెరావ్ కుటుంభం మొదటిగా ఒమెన్ లో, ఆ తరువాత దుబాయ్ లో స్థిరపడింది.ఆ తరువాత చివరిగా ఆస్ట్రేలియా లో స్థిరపడింది.

అయితే సెరావ్ మాత్రం ఇండియాలోనే పుట్టింది.

Advertisement

న్యాయవిద్యలో డిగ్రీ పూర్తీ చేసుకున్న ఆమె ప్రస్తుతం మెల్బోర్న్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జాబ్స్ ప్రెసింక్ట్స్ అండ్‌ రీజియన్స్‌లో పనిచేస్తున్నారు.ఆమె మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా గా ఎన్నికైన సందర్భంగా మాట్లాడుతూ , గతంలో ఎప్పుడూ ఇలాంటి అందాల పోటీలలో పాల్గొనలేదని ఇదే మొదటి సారని ఈ కిరీటం తనని వరించినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు