కుప్పంలో YSRCP అభిమానుల హంగామా.. 175/175 అంటూ గోడలపై రాతలు!

కుప్పంలో చంద్రబాబు నాయుడుని ఓడించాలని వైసీపీ గట్టి ప్రయత్నంలో ఉంది.ఈ మేరకు వైసీపీ కీలక నేతలు కుప్పంపై నజర్ పెట్టారు .

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ నెల 22న కుప్పంలో పర్యటిస్తున్నారు.దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడుకు ఈ నియోజకవర్గం బలమైన కోటగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే 2019లో ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం పంచాయతీని మున్సిపాలిటీగా మార్చారు.

అప్పటి నుండి ఇక్కడ వైఎస్సార్సీపీ చాలా యాక్టివ్‌గా పనిచేస్తుంది, వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ చంద్రబాబును ఓడించడమే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది.దానికి తగ్గట్టు కుప్పంలో వైసీపీ కార్యకర్తలు కూడా చాలా యాక్టీవ్‌గా పని చేస్తున్నారు.

Advertisement

తాజాగా కుప్పం విధుల్లో గోడలపై కనిపించిన కొన్ని నినాదాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.YSRCP అభిమానులు గోడలపై 175/175 అంటూ రాసిని నినాదాలను సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నానికి తగ్గట్టుగానే కార్యకర్తలు కూడా కష్టపడుతున్నారు.ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేల సమావేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన 175/175 విషయాన్ని హైలైట్ చేస్తూ కుప్పం ప్రజలను ఆకట్టుకునేలా చేస్తున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాలు గెలవడమే వైఎస్సార్సీపీ ఎజెండా అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.జగన్ కుప్పం నియోజక వర్గంలో పర్యటించనున్న నాలుగు రోజుల ముందు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన 200 మంది (టీడీపీ) సభ్యులు శనివారం అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషశ్రీ చరణ్‌లు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్‌, ఎమ్మెల్యే వెంకటేగౌడ, తదితరులు పాల్గొన్నారు.ఇక త్వరలో వైఎస్ జ‌గ‌న్ కుప్పంలో పర్యటించనున్న నేపథ్యంలో అతనే ప్రసంగంపై కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు