మిస్ ఇండియా ఇంటర్నేషనల్-2021 విజేత జోయా అఫ్రోజ్.మిస్ ఇండియా ఇంటర్నేషనల్- 2021 కిరీటాన్ని ముంబైకి చెందిన ఇరవై ఏళ్ల అందాల భామ జోయా అఫ్రోజ్ దక్కించుకుంది.
సూపర్ మోడల్ ఇండియా పేరుతో జరిగిన పోటీల్లో జోయా అఫ్రోజ్ విజేతగా నిలిచింది.ఈ ఏడాది నవంబర్ లో జపాన్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ పోటీల్లో మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది.
బాలీవుడ్ కోలీవుడ్ పలు చిత్రాల్లో నటించింది. వెబ్ సిరీస్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకుంది.2003లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రెండో రన్నరప్ గా నిలిచింది తాజాగా మిస్ ఇండియా ఇంటర్నేషనల్-2021 కిరీటాన్ని ముద్దాడింది.
మహిళలకు విద్య, ఆర్థిక, స్వాతంత్య్రం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించే దిశగా కృషి చేస్తుంది.
బాలికలు చదువుకోవాలని అన్ని రంగాల్లో ముందుండాలని ఎప్పుడూ కోరుతూ ఉంటుంది, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జోయా అఫ్రోజ్ కి పోటీగా పోటిలో నిలిచారు. జోయా అఫ్రోజ్ 1994 జనవరి 10న ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జన్మించింది.
ముంబైలోని తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.తండ్రి పేరు షాదాబ్ అఫ్రోజ్, తల్లి పేరు సలేహా అఫ్రోజ్, సోదరుడు జోష్ ఖాన్ అక్కచెల్లెలు ఎవరు లేరు.