సెమీ ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తేనే మిరపలో అధిక దిగుబడి..!

రైతులు( Farmers ) రాత్రి పగలు అనే తేడా లేకుండా పొలంలో ఎంత కష్టపడినా ఆశించిన లాభాలు పొందలేక చేసిన అప్పులు తీర్చలేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.అయితే కొంతమంది రైతులు ప్రత్యామ్నాయ పంటలు,ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు.

 Mirchi Cultivation In Semi Organic Method,semi Organic Method,mirchi Cultivation-TeluguStop.com
Telugu Farmers, Mirchi, Organic, Raithu, Semi Organic, Semiorganic-Latest News -

మిరప సాగు( Chilli Cultivation )ను సాధారణ పద్ధతిలో కాకుండా సెమీ ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చు.సెమీ ఆర్గానిక్ పద్ధతి( Semi Organic Method )లో మిరపను ఎలా సాగు చేయాలో అనే వివరాలు తెలుసుకుందాం.

ఇటీవలే కాలంలో రసాయన ఎరువుల వినియోగం పెరిగింది.దీంతో సారవంతమైన నేలలు చౌడు నేలలుగా మారిపోతున్నాయి.పైగా రసాయన ఎరువుల వాడకం వల్ల పెట్టుబడి కూడా భారీగానే ఉంటుంది.అలా కాకుండా సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి.

అందుబాటులో ఉన్న వనరుల్ని ఉపయోగించుకుని స్వయంగా సేంద్రియ ఎరువులను తయారు చేసుకుని పంట పొలాలకు అందించి సాగు చేస్తే నేల సారవంతం పెరగడంతో పాటు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించడానికి వీలుంటుంది.

Telugu Farmers, Mirchi, Organic, Raithu, Semi Organic, Semiorganic-Latest News -

సెమీ ఆర్గానిక్ పద్ధతిలో ముందుగా నేలను దుక్కులు దున్నుకొని, ఇతర పంటల అవశేషాలను పూర్తిగా తొలగించి, పశువుల ఎరువులు వేసి పొలాన్ని కలియదున్నుకోవాలి.పంట పొలంలో ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేస్తుండాలి.పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఏవైనా తెగుళ్లు లేదా చీడపీడలు పంటను ఆశిస్తే తొలిదశలోనే సేంద్రీయ పద్ధతిలో ఆవు మూత్రం లేదా వేప నూనెను పిచికారి చేసి పంటను సంరక్షించుకునే ప్రయత్నం చేయాలి.

పంట పొలంలో వీలైనంతవరకు రసాయన ఎరువులు, రసాయన పిచికారి మందుల వాడకం తగ్గించాలి.ఎందుకంటే ఇవి వాడితే దిగుబడి పెరిగినా కూడా పెట్టుబడి భారం వల్ల ఆశించిన లాభం పొందలేము.

పంట పొలంలో మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య కాస్త ఎక్కువ దూరం ఉంటే మొక్కలకు సూర్యరశ్మి, గాలి బాగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరిగి అధిక దిగుబడి ఇస్తాయి.మిరప రైతులు ఈ పద్ధతులను పాటిస్తే.

తక్కువ పెట్టుబడి తో ఎక్కువ దిగుబడి పొంది మంచి లాభం పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube