ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు

ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం అయ్యారు.ఇందులో భాగంగా కొత్త విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు.

అనంతరం మంత్రి బొత్స మాట్లాడుతూ భవిష్యత్తులో మెరుగైన విద్యా విధానంపై ఆలోచనలు చేసినట్లు తెలిపారు.యాప్ ల వలన సమయం వృధా అవుతుందని చెప్పారు.

టీచింగ్ పైనే దృష్టి సారించాలని సూచించామన్నారు.అదేవిధంగా బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వం ఆలోచనను వివరించామని వెల్లడించారు.

తమ ప్రతిపాదనలకు ఉపాధ్యాయ సంఘాలు ఆమోదం తెలిపాయని స్పష్టం చేశారు.నిర్ణయాల అమలులో లోపాలు ఉంటే మళ్లీ చర్చిస్తామన్నారు.

Advertisement

సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యాకానుకలను ఒకే కిట్ గా చేసి స్కూల్ పాయింట్లకు పంపిస్తామని పేర్కొన్నారు.పది రోజుల్లో బదిలీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి బొత్స వెల్లడించారు.

మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 
Advertisement

తాజా వార్తలు