ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం పై.. టిఆర్ఎస్ మంత్రి వైరల్ కామెంట్స్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా కష్టాలు.మామూలుగా లేవు.

సినిమా చూసే ప్రేక్షకులు ప్రభుత్వం తీసుకున్న .

నిర్ణయాలు సానుకూలంగానే ఉన్నా.సినిమా నిర్మించే నిర్మాతలకు, దర్శకులకు ,హీరోలకు ఇబ్బందిగా మారింది.

ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను తగ్గించడంతో పాటు ఇంకా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.బెనిఫిట్ షో లేకుండా.సినిమా టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకోకుండా.

ప్రభుత్వం అదుపు చేయటం పట్ల ఇండస్ట్రీ వైపు నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.మరోపక్క ప్రేక్షకులు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Advertisement

ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే  తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను నిర్మాతలు పెంచుకోవచ్చని వెసులుబాటు కల్పించింది.ఈ పరిస్థితిలో ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం పై టిఆర్ఎస్ మంత్రి సినిమాటోగ్రఫీ శాఖ చూస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

ఏపీలో థియేటర్ల సమస్య పై ఏపీ మంత్రులతో మాట్లాడతానని చెప్పుకొచ్చారు.చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే పుంజు కుంటుంది.

తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.

ఇండస్ట్రీ నమ్ముకుని చాలా మంది ఉపాధి పొందుతున్నారని.ఈ తరుణంలో సినిమా టికెట్ల రేట్లను పెంచడం మాత్రమే కాక రాష్ట్రంలో ఐదో షోకి కూడా.ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ల సమస్య విషయంలో అక్కడి మంత్రులతో మాట్లాడతానని సినిమా ఈవెంట్ కార్యక్రమంలో తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు