మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరామర్శించారు.నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు మంత్రి కేటీఆర్.
మంజులమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.వేముల కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో కన్నుమూసిన విషయం తెలిసిందే.