జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మేం నిజంగా బెదిరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.
పవన్ కళ్యాణ్ తిరగగలడా.? కొణిదెల పవన్ అనాలో లేక నారా నాదెండ్ల పవన్ అనాలో అర్థం కావడం లేదు.చిరంజీవి కుటుంబంలో అమ్ముడుపోయే వ్యక్తి ఉన్నందుకు బాధపడుతున్నం.ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశం అయితే.పవన్ కళ్యాణ్ తట్టుకోలేకపోతున్నారు.చంద్రబాబుతో పవన్ కి డీల్ కుదిరింది.
తెలుగుదేశం పార్టీ కోసమే జనసేన ఏర్పాటయిందని.మంత్రి అమర్నాథ్ విమర్శించారు.
ఇదిలా ఉంటే మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో.పవన్ కళ్యాణ్ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ మీడియా సమావేశంలో అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం పట్ల రియాక్ట్ అయ్యారు.వాళ్ళిద్దరు ఎందుకు కలిశారో నాకు తెలియదు నేను ఎవరిని అడగను అంటూ.
పవన్ వ్యాఖ్యానించారు.