భారత్ లో తొలి హైడ్రోజన్ బస్సు రోడ్లపై పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది.ఈ బస్సు దేశీయంగా తయారవడం విశేషం.
హైడ్రోజన్ ఇంధనంగా పనిచేసే ఈ నెక్ట్స్ జనరేషన్ బస్సును కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పూణేలో ఆవిష్కరించారు.డీజిల్ బస్సులతో పోల్చితే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తో నడిచే బస్సుల తయారీ వ్యయం చాలా తక్కువ అని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
ఈ హైడ్రోజన్ ఆధారిత బస్సులు దేశంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతాయని స్పష్టం చేశారు.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, కేపీఐటీ లిమిటెడ్ సంయుక్తంగా ఈ బస్సును అభివృద్ధి చేశాయి.
ఫ్యూయల్ సెల్ హైడ్రోజన్ ను, గాలిని క్రమపద్ధతిలో వినియోగించుకోవడం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తితో ఈ బస్సు నడుస్తుంది.దీని కారణంగా కాలుష్యం ఏర్పడదు.