కోట్లమంది ఎదురు చూస్తున్నాం.. గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారు? ఉపాసనపై కామెంట్స్!

స్టార్ సెలెబ్రేటిల అభిమానులు తమ అభిమాన హీరోల విషయంలో చాలా ఆత్రుతగా ఉంటారు.వారి సినిమా విషయం నుండి వారి వ్యక్తిగతం విషయాల వరకు బాగా శ్రద్ధలు చూపిస్తారు.

 Millions Of People Are Waiting When Will They Tell The Good News Comments On Upa-TeluguStop.com

ముఖ్యంగా వారి ఫ్యామిలీ విషయంలో బాగా శ్రద్ధ చూపిస్తారు.ఇప్పుడు అటువంటిందే ఒక స్టార్ హీరో ఫ్యామిలీపైన శ్రద్ధ చూపిస్తున్నారు అభిమానులు.

ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరో కాదు రామ్ చరణ్.ఇక ఈయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు.

అయితే ఈయన వ్యక్తిగత విషయంలో అభిమానులు ఎప్పటి నుండో ఒక కోరిక కోరుతున్నారు.అదేంటో అందరికి ఈ పాటికే అర్ధం అవ్వొచ్చు.అదే ఆయన తన వారసుడిని ఎప్పుడు ఇస్తారో అని.ఆయనకే కాదు ఆయన భార్య ఉపాసన కూడా పిల్లల గురించి ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది.అలా తాజాగా తన అభిమానుల నుండి తనకు ప్రశ్న ఎదురైంది.ఇంతకూ ప్రశ్న ఎలా ఎదురైందో చూద్దాం.

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి కోడలిగా, యంగ్ హీరో రామ్ చరణ్ సతీమణిగా ఉపాసన కొణిదెల తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది.పైగా వారి అభిమానులను కూడా తన అభిమానులుగా మార్చుకుంది.

ఇక ఈమె అపోలో వైస్ చైర్మన్ బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే.ఇక ఉపాసన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ప్రజలకు హెల్త్ టిప్స్ గురించి బాగా వివరిస్తుంది.గతంలో కోవిడ్ సమయంలో కూడా తన వంతు సహాయంతో ముందుకు వచ్చింది.ఇక రామ్ చరణ్, ఉపాసన ఓ మీటింగ్ లో తొలిసారిగా పరిచయం పెంచుకోగా.అలా వారి మధ్య ప్రేమ పుట్టగా.

ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్నారు.ఇక తమ పెళ్ళి జరిగి 10 ఏళ్లు దాటగా ఇప్పటికీ తమకు పిల్లలు పుట్టలేరన్న విషయం తమ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

పైగా తమకు పిల్లల గురించి అభిమానుల నుండి మీడియా నుండి కూడా తెగ ప్రశ్నలు ఎదురవగా వాటి గురించి ఎన్నోసార్లు స్పందించారు.కొన్నిసార్లు ఆ ప్రశ్నలను అక్కడే ఖండించారు.అయినా ఇప్పటికీ ఈ మెగా కోడలికి పిల్లల గురించి ప్రశ్న మాత్రం తప్పడం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఈ మెగా కోడలికి మాత్రం మంచి పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి.

మామకు తగ్గ కోడలు అని చాలా మంది చాలా సార్లు ప్రశంసలు కురిపించారు.

పైగా ఉపాసన సోషల్ సర్వీస్ లలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

ప్రతి ఒక్క విషయంలో తను బాగా స్పందిస్తుంది.ఇక ఆమె తన పిల్లల గురించి ఎన్నిసార్లు స్పందించిన కూడా చరణ్ అభిమానులు మాత్రం ఆమెను వదలట్లేరు.

మాకు జూనియర్ రామ్ చరణ్ కావాలి అంటూ తెగ కామెంట్లు పెడుతూ ఉంటారు.ఇక ఆమె ఆ కామెంట్లను భరించలేక కొన్ని కొన్ని సార్లు కామెంట్ సెషన్ ను మ్యూట్ లో కూడా పెట్టేస్తుంది.

ఆ మధ్య ఈమె సద్గురును కలిసి పిల్లల గురించి చర్చ చేసిన సంగతి తెలిసిందే.ఇక అందులో ఆమె మాట్లాడిన మాటలు కొందరు పూర్తిగా వినకుండా లేనిపోని పుకార్లను బాగా వైరల్ గా మార్చిన సంగతి తెలిసిందే.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తాను ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు పంచుకుంది.ఇక ఆ ఫోటోలకు బాగా లైక్స్ వచ్చాయి.అయితే మెగా అభిమానులు మాత్రం.మాకు మెగా వారసుడు కావాలి అంటూ కామెంట్స్ లో అడుగుతున్నారు.

ఇక ఓ అభిమాని.వదినమ్మ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావ్.

కోట్ల మంది ఎదురు చూస్తున్నాం వారసుడి కోసం అని అనగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

Netizens Asking about Ram Charan Upasana about having children

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube