ఇద్దరికి ఓకే చెప్పిన సూపర్ స్టార్‌.. ఈసారైనా సక్సెస్ దక్కేనా?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం జైలర్ అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.సినిమాకు సంబంధించిన వరకు అంచనాలు భారీగా ఉన్నాయి.

 Rajinikanth And Mani Ratnam Movie Update , Film News, Jailar Movie, Mani Ratnam,-TeluguStop.com

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇక రజినీకాంత్ తదుపరి సినిమా విషయానికి వస్తే భారీ అంచనాలు ఉన్నాయి.

ఆయన కుమర్తె దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు అనేది సమాచారం.అంతే కాకుండా తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమా తో తమిళనాట భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు గాను రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

Telugu Jailar, Mani Ratnam, Nelson Dileep, Rajinikanth-Movie

రెండు సినిమాలకు కమిట్ అయిన రజినీకాంత్ భవిష్యత్తులో మరిన్ని సినిమాలతో అభిమానులను ఎంటర్ టైన్ చేయాలని భావిస్తున్నాడు.ఈ వయసు లో కూడా ఇంత స్పీడ్ గా సినిమా లు చేయడం కేవలం ఈయనకి మాత్రమే చెల్లింది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మణిరత్నం దర్శకత్వంలో రజినీకాంత్ సినిమా అంటూ అభిమానులు  ఇప్పటి నుండే కళ్లు కాయలు కాయలు కాసే విధంగా ఎదురు చూపులు చూసే అవకాశం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం రజినీకాంత్ చేస్తున్న జైలర్ సినిమా అతి త్వరలోనే పూర్తి అయ్యి విడుదలకు సిద్ధం అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

దర్శకుడు నెల్సన్ దిలీప్ ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంతో కనిపిస్తున్నాడు.ఆయన ఈ సినిమా తో రజినీకాంత్ కి సక్సెస్ ను ఇస్తాను అంటున్నాడు.

జైలర్ కాకున్నా మణిరత్నం దర్శకత్వంలో చేయబోతున్న సినిమా అయినా రజినీకాంత్ కి సక్సెస్ ను తెచ్చి పెడుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సూపర్ స్టార్ కమర్షియల్ సక్సెస్ దక్కించుకుని చాలా సంవత్సరాలు అయ్యింది.

అందుకే ఈ ఎదురు చూపులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube