కుప్పకూలిన సైనిక హెలికాప్టర్.. ఇద్దరు పైలెట్లు మృతి

జమ్ము-కాశ్మీర్ లోని ఉదంపూర్ జిల్లాలో సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది.ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలెట్లు మరణించారు.

శివ్ గరధర్, ఈ ప్రాంతంలోని కొండ ప్రదేశాల్లో మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఈ విషాదం చోటుచేసుకుంది.ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

హెలికాప్టర్ లో చిక్కుకున్న ఇద్దరు పైలెట్లు బయటకు తీశారు తీవ్ర గాయాలతో ఉన్న వారిద్దరిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు ఆలస్యమైనట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

పైలెట్లు ఇద్దరూ మేజర్ ర్యాంక్ అధికారులే అని ఓ సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడించారు.ఆసుపత్రికి తరలించే లోపు వారు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు.

మృతులను మేజర్ రోహిత్ కుమార్, మేజర్ అనుజ్ రాజ్ పుత్ గా గుర్తించారు.  పైలెట్లు మృతి  ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

పట్నిటాప్ హెలికాప్టర్ దుర్ఘటన కలిసి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైలెట్లు మృతి  బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నానని, పైలెట్లు త్యాగానికి వందనం చేస్తున్నానని లెఫ్ట్ కల్నల్ మనోజ్ సిన్హా ట్విట్ చేశారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు