ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని ఉన్న తెలంగాణ వాసులు.... వార్ ఎఫెక్ట్

ఇరాన్-అమెరికా మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ప్రజలని తీవ్ర భయాందోళనకి గురి చేస్తున్నారు.

ఓ విధంగా చెప్పాలంటే రెండు దేశాలు దాడులు, ప్రతిదాడుల మధ్య యుద్ధం తప్పేలా లేదని ప్రపంచదేశాలన్నీ భావిస్తున్నాయి.అమెరికాపై ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగి ఇరాక్ లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది.

దీంతో ఇరాక్‌లో నివాసముంటున్న అనేక దేశాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు.ఈ దాడులు జరుగుతున్న ప్రాంతానికి అతి సమీపంలో నివసిస్తున్న తెలంగాణ వాసుల పరిస్థితి కూడా ఇంచు మించు ఇలాగే ఉంది.

ఎర్బిల్ ప్రాంతానికి తాము కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నామని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోయినట్లు తెలుగు గల్ఫ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దక్షిణామూర్తి తెలిపారు.అతని మాటల బట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Advertisement

సుమారు ఎనిమిది వేల మంది తెలంగాణ వాసులు ఇరాక్ లో ఉద్యోగాలు చేస్తున్నారు.తాము ఉంటున్న ప్రాంతానికి చాలా దగ్గరగా ఇరాన్ మిసైల్ దాడి జరిగిందని.

కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని దక్షిణామూర్తి తెలిపారు.తాము ఇళ్ళల్లో నుంచి బయటకి రావడం లేదని తెలిపారు.అయితే ఈ దాడుల వలన అందరూ భయాందోళనకి గురవుతున్నామని తెలిపారు.8వేల మంది తెలంగాణ వాసుల్లో అధికంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు మూర్తి తెలిపారు.వీరిలో చాలా మంది భవన నిర్మాణ ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కార్ లేఖ రాసిందని, త్వరలోనే కేంద్రం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని జనరల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ ఎన్నారై ప్రతినిధి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు