వేడి వేడి కూరలో పడిపోయిన చిన్నారి.. పాటలు వింటున్న వంటమనిషి!

ఈ మధ్యకాలం స్కూల్స్ ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అంటే.వాటిని చెప్పకూడదు లెండి.

నిన్నటికి నిన్న ఓ బాలుడు వేడి వేడి సాంబార్ లో పడి మృతి చెందాడు.ఈరోజు వేడి వేడి కూర గిన్నెలో పడి ఓ చిన్నారి మృతి చెందింది.

Mid Day Meal Hot Curry Baby In Uttar Pradesh-వేడి వేడి కూ�

మీకు అనుమానం రావచ్చు.ఆలా కూర గిన్నెలో చిన్నారి పడిపోతే వంట మనిషి ఏం చేస్తుంది అని.ఇక్కడే ఉంది అసలు కథ.ఆ చిన్నారి ఆ వేడి వేడి కూరలో పడిపోతే వంటమనిషి ఎంచెక్కా పాటలు వింటుంది.కనీసం ఆ చిన్నారి ఆ కూరలో పడింది అనికూడా చూసుకోనంతగా ఆమె పాటలు వింటుంది.

ఈ దారుణమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మిరజాపుర్ లోని ప్రభుత్వ పాటశాలలో చోటు చేసుకుంది.పాఠశాల మధ్యాహ్న భోజన పథకంలో వంట చేస్తున్న సమయంలో చిన్నారి ప్రాణాలు పోయాయి.

Advertisement

వంటమనిషి పాటల పిచ్చి కారణంగా చిన్నారి కూరలో ఉడికిపోయింది.ఆస్పత్రికి హుటాహుటిన తరలించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది.60 శాతానికి పైగా కాలిన గాయాలతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.దీంతో ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు తీవ్ర ఆగ్రహాన్ని తెలిపారు.

చిన్నారి మృతికి కారణమైన వంటమనిషిని సస్పెండ్ చేసినట్టు సమాచారం.కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయాల్సిందిగా మిరజాపుర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించింది.

ఏమైనప్పటికి వంటమనిషి నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృత్యువాత పడాల్సి వచ్చింది.

గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై రామ్ చరణ్ రియాక్షన్ ఇదే.. గర్వపడేలా చేస్తానంటూ?
Advertisement

తాజా వార్తలు