ఇక నుంచి మూడు రోజుల వీకాఫ్, విషయమేంటంటే

ఇప్పటివరకు కార్పొరేట్ సెక్టార్ లో వీకాఫ్ రెండు రోజులు మాత్రమే ఉండేది.

అయితే ఇప్పుడు ఈ వీకాఫ్ మరో రోజు పెరగనుందా అంటే నిజమే అని అనిపిస్తుంది.

ఎందుకంటే ఇలాంటి వినూత్న ప్రయత్నం జపాన్ లోని మైక్రో సాప్ట్ ప్రాక్టికల్ గా చేసి మంచి ఫలితాలను పొందింది.వివరాల్లోకి వెళితే.

జపాన్ లోని మైక్రో సాఫ్ట్ కంపెనీ 2,300 మంది ఉద్యోగులకు మూడు రోజుల వీకాఫ్ ఇస్తున్నట్లు ప్రకటిచింది.చాలా మంది ఉద్యోగులు కుటుంబ సభ్యులతో సరిగా గడపట్లేదని, ఎప్పుడూ కూడా పని, పని, పని అంటూ పనిలోనే మునిగిపోతూ ఫ్యామిలీ లైఫ్ తో సరిగా గడపడం లేదని,దీనితో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి అంటూ భావించిన మైక్రో సాఫ్ట్ మేనేజ్ మెంట్ ఇలా మూడు రోజుల వీకాఫ్ నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో వర్కింగ్ రిఫార్మ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ప్రారంభించి తమ ఉద్యోగులకు శుక్ర, శని, ఆదివారం వీకాఫ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.అయితే కేవలం ఒక్క నెల మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నట్లు ముందుగానే స్పష్టం చేసింది.అయితే వరుసగా మూడు రోజుల పాటు వీకాఫ్ వస్తే పని తగ్గిపోతుంది అని, ఉగ్యోగులలో బద్ధకం పెరిగిపోతుంది అని చాలా మంది భావించారు.కానీ అందుకు భిన్నంగా ఇది వరకటి కంటే ఇప్పుడు జపాన్ మైక్రోసాఫ్ట్‌లో వర్క్ ప్రొడక్షన్ 39.9 శాతం పెరగడం విశేషం.మరో విశేషం ఏమిటంటే గతంలో మైక్రోసాఫ్ట్‌లో రోజూ ఏవో ఒక మీటింగ్‌లు, చర్చలు అంటూ తెగ నడిచేవి అయితే మూడు రోజుల్ వీకాఫ్ ఉండడం తో టైం సరిపోదు అన్న ఉద్దేశ్యంతో వాటన్నిటి ని పక్కన పెట్టి మరి పనిచేస్తున్నారట.

Advertisement

టీ, కాఫీ అంటూ మాటిమాటికీ బయటకు వెళ్లకుండా కుదురుగా కూర్చొని మరీ బుద్ధిగా పని చేసుకుంటున్నట్లు వారి విచారణలో తేలింది.

మొత్తానికి మూడు రోజుల వీకాఫ్ వల్ల నష్టం కాదు,ప్రయోజనాలు ఉన్నాయి అని మైక్రో సాఫ్ట్ ఒక గట్టి అభిప్రాయానికి వచ్చింది.మరి ఒక్క నెలకు మాత్రమే పరిమితం చేసిన ఈ మూడు రోజుల వీకాఫ్ ని ఇక ఆ దిగ్గజ కంపెనీ ఫాలో అవుతుందో ఏమో చూడాలి.ఒకవేళ మైక్రో సాఫ్ట్ గనుక ఈ మూడు రోజుల వీకాఫ్ ని ఫాలో అయితే మాత్రం మిగిలిన కంపెనీ లు తప్పకుండా ఫాలో అవుతాయి కాబట్టి ఇక కార్పొరేట్ కంపెనీ ల పని దినాలు కేవలం 4 రోజులు మాత్రమే ఉండబోతున్నాయి అన్నమాట.

Advertisement

తాజా వార్తలు