Miss Teen USA 2023 : ఈ ఏడాది ‘‘మిస్ టీన్ యూఎస్ఏ’’గా భారత సంతతి బాలిక ..!!

అమెరికాలో భారత సంతతి బాలిక ఉమాసోఫియా శ్రీవాస్తవ ( Umasophia Srivastava )అరుదైన ఘనత సాధించింది.

ఈ ఏడాదికి గాను మిస్ టీన్ యూఎస్ఏ 2023గా ఆమె కిరీటాన్ని అందుకుంది.

నెవాడా రాష్ట్రంలో( Nevada ) జరిగిన తుది పోటీలో 50 మందిని ఓడించి ఉమా ఈ ఘనత సాధించింది.సెయింట్ ఎలిజబెత్ అకాడమీలో చదువుకుంటున్న ఉమా.ఈ ఏడాది ప్రారంభంలో New Jersey Teen USA కిరీటాన్ని అందుకుంది.తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మెక్సికన్ ఇండియన్‌గా నిలిచింది.

మరోవైపు.మిస్ టీన్ యూఎస్ఏ 2023 పోటీల్లో న్యూయార్క్‌కు చెందిన స్టెఫానీ స్కిన్నర్ తొలి రన్నరప్‌గా, ‘‘మిస్ పెన్సిల్వేనియా టీన్ యూస్ఏ’’ రాగీ మాస్.

సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.మిస్ టీన్ యూఎస్ఏ 2023 కిరీటాన్ని అందుకున్న తర్వాత ఉమాసోఫియా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

Advertisement

‘‘ ఈ రాత్రి నిజంగా నా జీవితంలో అత్యుత్తమ రాత్రి.ప్రేక్షకుల ఉత్సాహం మధ్యలో, వారి ప్రేమ, మద్ధతుతో ఈ కిరీటం పొందాను.

మిస్ టీన్ యూఎస్ఏ 2023గా నిలిచిన తొలి మెక్సికన్ ఇండియన్‌‌గా నిలిచినందుకు గర్వంగా వుంది.మీ అందరికీ కృతజ్ఞతలు అని ఆమె పోస్ట్ చేశారు.

ఇంగ్లీష్, స్పానిష్, హిందీ, ఫ్రెంచ్( English, Spanish, Hindi, French ) భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఉమా శ్రీవాస్తవకు ఐక్యరాజ్యసమితి అంబాసిడర్ కావాలన్నది కల.భారతదేశంలోని అణగారిన పిల్లలకు మంచి విద్య, సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ అందించడంలో సహాయం చేసేందుకు ‘‘లోటస్ పెటల్ ఫాండేషన్’’తో కలిసి ఉమా పనిచేస్తోంది.‘‘ Diversity & ’’కి ఆమె కో ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు.

మాక్ ట్రయల్, మోడల్ యునైటెడ్ నేషన్స్‌లో కూడా పాల్గొంటూ వస్తోంది.చిన్న వయసులోనే ఆమె ‘‘ ది వైట్ జాగ్వార్’’( The White Jaguar ) అనే పుస్తకాన్ని రచించింది.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

పియానిస్ట్‌గా, సొంతంగా బ్లాగ్‌ను సైతం ఉమా నడుపుతున్నారు.

Advertisement

కాగా.మిస్ టీన్ యూఎస్ఏ పోటీసులు 1983 నుంచి జరుగుతున్నాయి.అమెరికాలోని 14 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న యువతులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు.

మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఈ పోటీలను నిర్వహిస్తూ వస్తోంది.ఇప్పటి వరకు 41 సార్లు పోటీలు జరిగాయి.

గతేడాది నెబ్రాస్కాకు చెందిన ఫారోన్ మేధీ మిస్ టీన్ యూఎస్ఏ 2022గా నిలిచారు.

తాజా వార్తలు