యూట్యూబర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దీప్తి సునయన ( Deepthi Sunaina ) ఒకరు.ఈమె ఎన్నో యూట్యూబ్ వీడియోలు కవర్ సాంగ్స్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా యూట్యూబర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ 2 కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా నటుడు తనీష్ ( Taneesh ) తో లవ్ ఎఫైర్స్ అంటూ పెద్ద ఎత్తున పాపులర్ అయ్యారు అయితే ఈ కార్యక్రమం అనంతరం ఈమె మరొక యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ( Shanmukh Jaswanth ) ప్రేమలో పడ్డారు.
ఇక వీరిద్దరూ తరచూ సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండేది కాదు ఇద్దరు కలిసి షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లలో నటించడమే కాకుండా ఎన్నో కవర్ సాంగ్స్ కూడా చేశారు.ఇక వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడం కాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్న క్రమంలో షణ్ముఖ్ జస్వంత్ కి బిగ్ బాస్ అవకాశం రావడంతో ఈయన కూడా సీజన్ 5 కార్యక్రమంలో పాల్గొన్నారు.అక్కడికి వెళ్లిన తర్వాత షన్ను సిరి హనుమంతుతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు.
అప్పటికే వీరిద్దరికి లవర్స్ ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మరిచిపోయి హౌస్ లో భగ్న ప్రేమికులుగా వీరిద్దరూ ప్రవర్తించిన తీరు అందరికీ కాస్త విసుగు తెప్పించింది.దీంతో ఏకంగా దీప్తి సునయన తన ప్రియుడికి బ్రేకప్ చెప్పుకొని ప్రస్తుతం ఒంటరిగా తన కెరీర్ పై దృష్టిపెట్టారు ప్రస్తుతం ఈమె ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ సందడి చేస్తున్నారు.ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే దీప్తి సునయన తరచూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈమె చీరకట్టులో దిగిన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
నడుమును హరివిల్లులా వంచి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.అలాగే బ్యాక్ అందాలతో అందరిని టెంప్ట్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే ఈ ఫోటోల పైన నేటిజన్స్ ఎప్పటిలాగే బోల్డ్ కామెంట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈమె గ్లామరస్ ఫోటోలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది…నువ్వు ఎంత ఎక్స్పోజ్ చేసిన ఎలాంటి ప్రయోజనం లేదని కామెంట్ చేశారు.
ఇలా ఎన్నో ఎక్స్పోజింగ్ ఫోటోలు షేర్ చేసిన ఎన్ని రీల్స్ చేసిన నీకు మాత్రం హీరోయిన్ గా అవకాశాలు అస్సలు రావు.నీ హైట్ కి , నీ ఓవరాక్షన్ కి హీరోయిన్ కాదు కదా కనీసం సైడ్ యాక్టర్ కూడా కాలేవు అంటూ దారుణంగా ఈమెను అవమాన పరుస్తూ నేటిజన్ చేసినటువంటి కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా ఈమె ఫోటోలపై తరచూ ఈ విధమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ రావడం సర్వసాధారణం అయినప్పటికీ వీటి గురించి దీప్తి ఏమాత్రం పట్టించుకోకుండా కెరియర్ లో ముందుకు వెళ్లడం కోసం భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు.