అరటి లో లేస్ వింగ్ బగ్ పురుగులను అరికట్టే పద్ధతులు..!

అరటి పంటకు( banana crop ) తీవ్ర నష్టం కలిగించే చీడ పీడలలో లేస్ వింగ్ బగ్ పురుగులు( Wing bug insects ) ప్రధానమైనవి.ఈ పురుగులు పసుపు, తెలుపు రంగులలో ఉండి నాలుగు మిల్లీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి.

 Methods To Prevent Lace Wing Bugs In Banana, Banana, Stethoconus Profectus, Dime-TeluguStop.com

ఇక ఈ పురుగుల రెక్కలు అల్లికల వలే ఉంటాయి.ఒక ఆడ పురుగు దాదాపుగా 25 గుడ్లు పెడుతుంది.

రెండు వారాలలో ఈ గుడ్లలో నుంచి పిల్ల పురుగులు బయటకు వస్తాయి.

ఈ పురుగులు ఆశించిన మొక్క యొక్క ఆకులు పై భాగంలో తెల్లని పాలిపోయిన మచ్చల రూపంలో కనిపిస్తాయి.

ఇక ఆకు అడుగు భాగంలో ఈ పురుగుల మలపదార్థం ఉంటుంది.ఈ పురుగులు ఆశించిన మొక్కల యొక్క ఆకులు ముందుగా పసుపు రంగులోకి మారి ఆ తర్వాత గోధుమ రంగులోకి మారుతూ ఎండిపోతాయి.

సాధారణంగా మొక్క ఆరోగ్యంగా లేదు అంటే ఈ పురుగులు ఆ మొక్కను ఆశించినట్లుగా నిర్ధారించుకోవాలి.

ఈ పురుగులు ఆకులలో ఉండే రసాన్ని పీల్చడంతో మొక్క యొక్క ఎదుగుదల పూర్తిగా తగ్గిపోతుంది.కాబట్టి ముందుగా ఆరోగ్యమైన, తెగులను తట్టుకునే మేలురకం మొక్కలను పొలంలో నాటుకోవాలి.క్రమం తప్పకుండా అరటి మొక్కలలో ఈ పురుగుల ఉనికిని గుర్తిస్తూ, ఈ పురుగులు సోకిన మొక్కను పంటను పొలం నుండి వేరు చేయాలి.

ఇక స్టేతోకోనుస్ ప్రాఫెక్టుస్( Stethoconus profectus ) లాంటి కీటక జాతులను ఉపయోగించి ఈ పురుగులను అరికట్టవచ్చు.వేప నూనె మరియు వెల్లుల్లి కలిపిన రసాయనాన్ని పంటపొలంపై పిచికారి చేయడం వల్ల ఈ పురుగుల బెడదను దాదాపుగా నివారించవచ్చు.ఒకవేళ ఈ పురుగుల వ్యాప్తి అధికంగా ఉన్న సమయాలలో రసాయన పిచ్చికారి మందులను ఉపయోగించాలి. డైమిథోయెట్( Dimethoate ) మరియు క్వినాల్ఫోస్ కలిగి ఉన్న ఏదైనా రసాయన పిచికారి మందును పంట యొక్క లేత ఆకులు, కాండం పూర్తిగా తరిచే విధంగా పిచికారి చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube