ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణ పురంలో శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ, ముత్యాలమ్మ తల్లి విగ్రహాలు,బొడ్రాయి (నాభిశిల) ప్రతిష్ఠాపన మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది.ఈ మహోత్సవానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారికి గ్రామస్తులు మేళతాళాలతో అపూర్వ స్వాగతం పలికారు.
వారు 20అడుగుల భారీ ఆంజనేయ స్వామి, బొడ్రాయి,హోమ గుండాన్ని సందర్శించి కొబ్బరికాయలు కొట్టారు,గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు.
ముఖ్య అతిథులకు వేద పండితులు ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు,వారి బంధుమిత్రులతో కళకళలాడింది.ఈ మహోత్సవంలో ఎమ్మెల్యే వెంకటవీరయ్య ధర్మపత్ని మహాలక్ష్మీ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉమా మహేశ్వరరావు, సత్తుపల్లి మునిసిపల్ ఛైర్మన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.







