అరటి లో లేస్ వింగ్ బగ్ పురుగులను అరికట్టే పద్ధతులు..!
TeluguStop.com
అరటి పంటకు( Banana Crop ) తీవ్ర నష్టం కలిగించే చీడ పీడలలో లేస్ వింగ్ బగ్ పురుగులు( Wing Bug Insects ) ప్రధానమైనవి.
ఈ పురుగులు పసుపు, తెలుపు రంగులలో ఉండి నాలుగు మిల్లీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి.
ఇక ఈ పురుగుల రెక్కలు అల్లికల వలే ఉంటాయి.ఒక ఆడ పురుగు దాదాపుగా 25 గుడ్లు పెడుతుంది.
రెండు వారాలలో ఈ గుడ్లలో నుంచి పిల్ల పురుగులు బయటకు వస్తాయి.ఈ పురుగులు ఆశించిన మొక్క యొక్క ఆకులు పై భాగంలో తెల్లని పాలిపోయిన మచ్చల రూపంలో కనిపిస్తాయి.
ఇక ఆకు అడుగు భాగంలో ఈ పురుగుల మలపదార్థం ఉంటుంది.ఈ పురుగులు ఆశించిన మొక్కల యొక్క ఆకులు ముందుగా పసుపు రంగులోకి మారి ఆ తర్వాత గోధుమ రంగులోకి మారుతూ ఎండిపోతాయి.
సాధారణంగా మొక్క ఆరోగ్యంగా లేదు అంటే ఈ పురుగులు ఆ మొక్కను ఆశించినట్లుగా నిర్ధారించుకోవాలి.
"""/" /
ఈ పురుగులు ఆకులలో ఉండే రసాన్ని పీల్చడంతో మొక్క యొక్క ఎదుగుదల పూర్తిగా తగ్గిపోతుంది.
కాబట్టి ముందుగా ఆరోగ్యమైన, తెగులను తట్టుకునే మేలురకం మొక్కలను పొలంలో నాటుకోవాలి.క్రమం తప్పకుండా అరటి మొక్కలలో ఈ పురుగుల ఉనికిని గుర్తిస్తూ, ఈ పురుగులు సోకిన మొక్కను పంటను పొలం నుండి వేరు చేయాలి.
"""/" /
ఇక స్టేతోకోనుస్ ప్రాఫెక్టుస్( Stethoconus Profectus ) లాంటి కీటక జాతులను ఉపయోగించి ఈ పురుగులను అరికట్టవచ్చు.
వేప నూనె మరియు వెల్లుల్లి కలిపిన రసాయనాన్ని పంటపొలంపై పిచికారి చేయడం వల్ల ఈ పురుగుల బెడదను దాదాపుగా నివారించవచ్చు.
ఒకవేళ ఈ పురుగుల వ్యాప్తి అధికంగా ఉన్న సమయాలలో రసాయన పిచ్చికారి మందులను ఉపయోగించాలి.
డైమిథోయెట్( Dimethoate ) మరియు క్వినాల్ఫోస్ కలిగి ఉన్న ఏదైనా రసాయన పిచికారి మందును పంట యొక్క లేత ఆకులు, కాండం పూర్తిగా తరిచే విధంగా పిచికారి చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.