మినుము పంటను ఆశించే బూడిద తెగుళ్లను నివారించే పద్ధతులు..!

మినుము పంట సాగు ( Black Gram Cultivation )తక్కువ పెట్టుబడి వ్యయంతో కూడుకున్నది కాబట్టి చాలామంది రైతులు ( Farmers )మినుము పంటను సాగు చేస్తున్నారు.ఈ మినుము పంటను మొక్కజొన్న, కంది లాంటి పంటలలో అంతర పంటగా కూడా సాగు చేయవచ్చు.

 Methods To Prevent Ash Pests That Expect Minumu Crop , Black Gram Cultivation ,-TeluguStop.com

దీంతో రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు.అయితే మినుము పంటను సస్య సంరక్షక పద్ధతులు పాటించి సాగు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చు.

మినుము పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లలో బూడిద తెగుళ్లు( Gray pests ) కీలక పాత్ర పోషిస్తాయి.మొక్కల అవశేషాలలో దాగివున్న శిలీంద్ర బీజాంశాలు గాలి, నీరు ఇతర క్రిముల ద్వారా పంట మొక్కలను ఆశిస్తాయి.బూడిద తెగులు అనేది ఒక శిలీంద్రం అయినా కూడా పొడి వాతావరణం లో కూడా ఇది పెరుగుతుంది.ఈ శిలీంద్రం 10 నుండి 12° మధ్య ఉండే ఉష్ణోగ్రతలో జీవిస్తుంది.

వర్షం లేదంటే పొగ మంచు ఉంటే ఈ తెగులు పంటకు త్వరగా వ్యాప్తి చెందుతాయిఈ తెగులు ఆకులు, కాండం, కాయలను ప్రభావితం చేస్తాయి.ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు వంకర్లు తిరగడం విచ్చిన్నం కావడం జరగడంతో పాటు ఎదుగుతున్న చిగుళ్ల రూపు మారిపోతుంది.

తెగులు నిరోధక రకాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి.మొక్కల మధ్య గాలి, సూర్యరశ్మి బాగా తగిలేటట్లు దూరంగా విత్తుకోవాలి.పంటను గమనిస్తూ ఉంటూ ఈ తెగులు లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ మొక్కలను పొలం నుంచి తొలగించాలి.ఈ తెగులను పొలంలో గుర్తించిన తర్వాత గంధకం, వేప నూనె, కావోలిన్ లలో ఏదో ఒకదానిది పిచికారి చేయాలి.

రసాయన పద్ధతిలో( Chemically ) ఈ తెగులను అరికట్టాలంటే. మైక్లోబ్యూటనిల్, హెక్సాకొనజోల్ట్ ట్రైఫ్లుమిజోల్ లలో ఏదో ఒక దానిని ఒక లీటరు నీటికు రెండు మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube