మినుము పంటను ఆశించే బూడిద తెగుళ్లను నివారించే పద్ధతులు..!
TeluguStop.com
మినుము పంట సాగు ( Black Gram Cultivation )తక్కువ పెట్టుబడి వ్యయంతో కూడుకున్నది కాబట్టి చాలామంది రైతులు ( Farmers )మినుము పంటను సాగు చేస్తున్నారు.
ఈ మినుము పంటను మొక్కజొన్న, కంది లాంటి పంటలలో అంతర పంటగా కూడా సాగు చేయవచ్చు.
దీంతో రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు.అయితే మినుము పంటను సస్య సంరక్షక పద్ధతులు పాటించి సాగు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చు.
"""/" /
మినుము పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లలో బూడిద తెగుళ్లు( Gray Pests ) కీలక పాత్ర పోషిస్తాయి.
మొక్కల అవశేషాలలో దాగివున్న శిలీంద్ర బీజాంశాలు గాలి, నీరు ఇతర క్రిముల ద్వారా పంట మొక్కలను ఆశిస్తాయి.
బూడిద తెగులు అనేది ఒక శిలీంద్రం అయినా కూడా పొడి వాతావరణం లో కూడా ఇది పెరుగుతుంది.
ఈ శిలీంద్రం 10 నుండి 12° మధ్య ఉండే ఉష్ణోగ్రతలో జీవిస్తుంది.వర్షం లేదంటే పొగ మంచు ఉంటే ఈ తెగులు పంటకు త్వరగా వ్యాప్తి చెందుతాయిఈ తెగులు ఆకులు, కాండం, కాయలను ప్రభావితం చేస్తాయి.
ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు వంకర్లు తిరగడం విచ్చిన్నం కావడం జరగడంతో పాటు ఎదుగుతున్న చిగుళ్ల రూపు మారిపోతుంది.
"""/" /
తెగులు నిరోధక రకాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి.మొక్కల మధ్య గాలి, సూర్యరశ్మి బాగా తగిలేటట్లు దూరంగా విత్తుకోవాలి.
పంటను గమనిస్తూ ఉంటూ ఈ తెగులు లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ మొక్కలను పొలం నుంచి తొలగించాలి.
ఈ తెగులను పొలంలో గుర్తించిన తర్వాత గంధకం, వేప నూనె, కావోలిన్ లలో ఏదో ఒకదానిది పిచికారి చేయాలి.
రసాయన పద్ధతిలో( Chemically ) ఈ తెగులను అరికట్టాలంటే.మైక్లోబ్యూటనిల్, హెక్సాకొనజోల్ట్ ట్రైఫ్లుమిజోల్ లలో ఏదో ఒక దానిని ఒక లీటరు నీటికు రెండు మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారి చేయాలి.