అబ్బాయిలతో చాటింగ్ చేయొద్దని ఎంత చెప్పినా చెల్లెలు వినకపోవడంతో అన్న ఏకంగా...

ఈమధ్య కాలంలో కొందరు సోషల్ మీడియా మాధ్యమాలకు బానిసలై నిత్యం సెల్ ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతున్నారు.

అయితే తాజాగా 16 సంవత్సరాలు కలిగిన ఓ యువతి ఎంత చెప్పినా సోషల్ మీడియా మాధ్యమాలలో చాటింగ్ చేయడం మానకపోవడంతో చివరికి తన అన్నయ్య దారుణంగా కాల్చి చంపిన ఘటన ఢిల్లీ నగర పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే సంధ్య (పేరు మార్చాం) అనే ఓ 16 సంవత్సరాలు కలిగిన యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ నగర పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సెలవులు కావడంతో కాలేజీ కి వెళ్ళకుండా ఇంటి పట్టునే ఉంటోంది.

 ఈ క్రమంలో అప్పుడప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలను అబ్బాయిలతో చాటింగ్ చేసేది. ఈ విషయాన్ని గమనించిన సంధ్య అన్నయ్య సోషల్ మీడియాలో మగవాళ్ళతో చాటింగ్ చేయొద్దని పలుమార్లు మందలించాడు.

 అయినప్పటికీ సంధ్య  తన అన్నయ్య మాటలను పెడచెవిన పెడుతూ ఉండేది.ఈ క్రమంలో మరోమారు సంధ్య తన అన్నయ్యకు సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ కనిపించింది.

Advertisement

 దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతో సంధ్యపై కాల్పులు జరిపాడు.దీంతో కాల్పుల శబ్దం విన్నటువంటి కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

 సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు