పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ బాలికపై దారుణంగా...

ప్రస్తుత కాలంలో కొందరు పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి అభం శుభం తెలియని అమాయక మైనర్ బాలికలను నమ్మించి వారిపై దారుణంగా అత్యాచారానికి ఒడిగడుతున్నారు.

తాజాగా 33 సంవత్సరాలు కలిగినటువంటి ఓ వ్యక్తి 16 కలిగినటువంటి మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని సత్యనారాయణపురం పరిసర ప్రాంతంలో 16 సంవత్సరాలు కలిగినటువంటి మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.అయితే ఇదే ప్రాంతంలో 33 సంవత్సరాల కలిగినటువంటి ఖుద్దుస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

అయితే ఇతడు గత కొద్దికాలంగా మైనర్ బాలిక పై కన్నేశాడు.ఈ క్రమంలో ఎలాగైనా బాలికను లొంగ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుండేవాడు.

అయితే రోజు పనుల నిమిత్తం బయటికి వెళ్తున్నటువంటి బాలికను వెంబడించి ప్రేమ పేరుతో పలు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.ఈ క్రమంలో రెండు, మూడు సార్లు ఆమె పై అత్యాచారం చేశాడు.

Advertisement

అయితే చివరికి ఈ విషయం తెలుసుకున్నటువంటి మైనర్ బాలిక తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి కుద్దుస్ పై ఫిర్యాదు చేశారు.దీంతో వెంటనే పోలీసులు నిందితుడు ఖుద్దుస్ ని  అదుపులోకి విచారణ చేపట్టారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు