సుమన్ కి శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. డియర్ సుమన్ అంటూ?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరికొకరు విష్ చేసుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది.

కాగా ఈ మధ్యకాలంలో సీనియర్ స్టార్ హీరోలు ఒకరిని ఒక విష్ చేసుకోవడం అన్నది ఎక్కువ అయిపోయింది.

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల మధ్య ఉన్న సాన్నిహిత్యం మరింత పెరుగుతూ వస్తోంది.ఈ క్రమంలోనే అకేషన్ ను బట్టి ఒకరితో మరొకరు సందర్భాన్ని బట్టి విష్ చేసుకుంటున్నారు.

ఈక్రమంలోనే 90స్ హీరోలలో ఒకరైన సుమన్ కి, మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గా విషెష్ చెప్పారు.సుమన్ అభినందిస్తూ ఒక వీడియో కూడా తన సోషల్ మీడియా పేజ్ లో రిలీజ్ చేశారు.

హీరో సుమన్ కి ఈ ఏడాదితో నటుడిగా 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సుమన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ.ప్రత్యేకంగా ఓ వీడియోని రిలీజ్ చేశారు.

Advertisement

డియర్ సుమన్ నటుడిగా 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మై డియర్ బ్రదర్ సుమన్‌కి నా శుభాకాంక్షలు, పది భాషల్లో 700 లకు పైగా సినిమాలు చేయడం అద్బుతం.బెంగుళూరులో ఫిబ్రవరి 16న జరుగబోతున్న 45 ఇయర్స్ ఈవెంట్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానంటూ చిరంజీవి తెలిపారు.

సుమన్ తన కెరియర్లో కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళం కన్నడ సినిమాలలో కూడా బాగా నటించారు.

తెలుగుతో పాటు కన్నడలో కూడా సుమన్ కి విపరీతమైన అభిమానులు ఉన్నారు.ప్రస్తుతం ఆడపాదడపా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.చిరంజీవి సుమన్ కి విష్ చేస్తూ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇకపోతే మెగాస్టార్ విషయానికి వస్తే ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో పలకరించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే తన తదుపరి సినిమా అయిన భోళా శంకర్ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు.

మంచు మనోజ్ విలన్ గా రాణిస్తాడా..? ఆయన కోసం కొన్ని క్యారెక్టర్స్ ను క్రియేట్ చేస్తున్నారా..?
Advertisement

తాజా వార్తలు