మెగాస్టార్‌ చిరంజీవిపై పంచ్‌ వేసిన కొరటాల శివ

నేడు రామ్‌ చరణ్‌ బర్త్‌డే సందర్బంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం నుండి ఎన్టీఆర్‌ పాత్ర భీమ్‌కు చెందిన సర్‌ప్రైజింగ్‌ వీడియోను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.

నేడు 10 గంటలకు వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేయాల్సి ఉండగా విడుదల చేయలేదు.

దాంతో ఫ్యాన్స్‌ అంతా కూడా తీవ్ర నిరుత్సాహంను వ్యక్తం చేయడం జరిగింది.ఈ సమయంలోనే చిరంజీవి వీడియో విడుదలకు కొద్ది సమయం ముందు ఐయామ్‌ వెయిటింగ్‌ అంటూ ఒక పోస్ట్‌ పెట్టాడు.

చిరంజీవి పోస్ట్‌కు రాజమౌళి సమాధానంగా సర్‌.అది.కాస్త.ఆలస్యం అంటూ ట్వీట్‌ చేశాడు.

ఆ ట్వీట్‌కు దర్శకుడు కొరటాల శివ సరదాగా స్పందించాడు.త్వరగా విడుదల చేయండి సర్‌ లేదంటే మా ఆచార్య టైటిల్‌ను కనుక రివీల్‌ చేసినట్లుగా ఆ సర్‌ప్రైజ్‌ను బాస్‌ ముందే రివీల్‌ చేస్తాడు అంటూ కామెంట్‌ చేశాడు.

Advertisement

దీనికి మెగాస్టార్‌ నుండి ఎలాంటి కౌంటర్‌ వస్తుంది అనేది చూడాలి.

ఉగాది రోజు ట్విట్టర్‌లో జాయిన్‌ అయిన మెగాస్టార్‌ చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు.ఆయన ట్విట్టర్‌లో చేస్తున్న హడావుడి చూస్తుంటే మెగా ఫ్యాన్స్‌కు ముచ్చట వేస్తుందట.ప్రస్తుతం ట్విట్టర్‌లో చిరంజీవి ట్వీట్స్‌ ఆయన అభిమానులకు సంతోషంను కలిగిస్తుందట.

ప్రతి ఒక్క పోస్ట్‌ కూడా చాలా సరదాగా యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు.మెగాస్టార్‌ చిరంజీవి రైట్‌ టైంలో ట్విట్టర్‌లో అడుగు పెట్టినట్లుగా నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు