తమ్ముడుపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన చిరు.. మా కోసం అలా చేస్తాడంటూ..

మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.

ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో దసరా పండుగకు వచ్చిన మెగాస్టార్ ఇప్పుడు సంక్రాంతి పండుగకు వాల్తేరు వీరయ్య సినిమాలో వస్తున్నాడు.

చిరంజీవి మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య.ఈ సినిమాపై ఇప్పటికే ఇటు మెగా ఫ్యాన్స్ తో పాటు అటు మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరి రేపు జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.చిరు అయితే కాస్త కూడా రెస్ట్ లేకుండా వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.

Advertisement

తాజాగా చిరు మీడియా సమావేశంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.పవన్ సినిమాల విషయం పక్కన పెడితే రాజకీయాల్లో ఎప్పుడు తమని కానీ తమ కుటుంబాన్ని కానీ సహాయం అడగలేదని.తన రాజకీయ విషయంలో రావొద్దని తాను ఒక్కడినే చూసుకుంటానని చెబుతూ ఉంటాడని తన వల్ల మేము ఇబ్బంది పడతామని అలా అంటాడు అని చేసిన ఈ కామెంట్స్ నెట్టింట మంచి వైరల్ అయ్యాయి.

2023 సంక్రాంతి బరిలో భారీ పోటీ మధ్య వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.

చూడాలి మరి బాలయ్యతో పోటీలో చిరు విన్ అవుతాడో లేదో.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు