ఫార్మల్ లుక్స్ తో అదరగొడుతున్న మెగా ప్రిన్స్....

ముకుంద చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన టువంటి మెగా హీరో వరుణ్ తేజ్ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

వచ్చీ రావడం తోనే ముకుంద చిత్రంతో మంచి హిట్  అందుకున్నటువంటి వరుణ్ తేజ్ కి ఆ తర్వాత మిస్టర్ చిత్రం రూపంలో ఎదురు దెబ్బ తగిలింది.

అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఫిదా చిత్రం బాగానే ఆకట్టుకోవడంతో మళ్ళి ట్రాక్ లో పడ్డాడు.అయితే తాజాగా వరుణ్ తేజ్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి.

ఇందులో వరుణ్ తేజ్ డీసెంట్ గా ఉండేటువంటి ఫార్మల్ డ్రెస్లో అదరగొడుతున్నాడు.అయితే ఈ ఫోటోలు తన తదుపరి చిత్ర షూటింగ్ లో భాగంగా తీసినటువంటి ఫోటోలు లాగా కనిపిస్తున్నాయి.

ఇందులో వరుణ్ తేజ్ ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గతంలో తమ్ముడు సినిమాలో ఉన్నటువంటి కొన్ని సీన్ల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.అంతేగాక తమ్ముడు చిత్రాన్ని పూర్తిగా రీమేక్ చేయడానికి అప్పట్లో సన్నాహాలు కూడా చేశారు.

కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఇమేజ్ కారణంగా తమ్ముడు చిత్రంలోని పవన్ కళ్యాణ్ పాత్రకి వరుణ్ సరిపోడని ఆగిపోయింది.

Advertisement

తాజా వార్తలు