రికార్డ్ః మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచిన ఉప్పెన

సినిమా పరిశ్రమలో లాక్ డౌన్‌ కు ముందు లాక్ డౌన్ కు తర్వాత పరిస్థితులు లేదా కరోనాకు ముందు కరోనా తర్వాత పరిస్థితులు అన్నట్లుగా ఏర్పడింది.

కరోనా కు ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ రావాలంటే కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటున్నారు.

కొన్ని థియేటర్లు పూర్తిగా మూత పడటంతో పాటు ఏకంగా కూల్చి వేసి ఫంక్షన్‌ హాల్స్ లేదా షాపింగ్‌ కాంప్లెక్స్ లు గా మార్చేశారు.అందుకే చాలా వరకు కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్లుగా పరిస్థితి ఉంది.

కరోనా ముందు వరకు వంద కోట్ల సినిమా అంటే చాలా మామూలు విషయం.కాని ఇప్పుడు వంద కోట్ల సినిమా అంటే చాలా గొప్ప విషయం.

ఎందుకంటే కరోనా భయంతో ప్రేక్షకులు కనీసం థియేటర్ల వైపు చూడాలంటే భయపడుతున్నారు.ఇలాంటి సమయంలో విడుదల అవ్వడమే గగనం అలాంటిది వంద కోట్ల వసూళ్లు నమోదు చేయడం అంటే అద్బుతమే అనుకుంటున్న సమయంలో మన ఉప్పెన సినిమా ఆ ఘనత దక్కించుకుంది.

Advertisement

వైష్ణవ్ తేజ్‌ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా సుకుమార్‌ శిష్యుడు బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది.ఏకంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ ను ఈ సినిమా దక్కించుకుంది.

ఇన్ని రోజులు వంద కోట్ల కు కాస్త దూరంలో ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు వంద కోట్లను చేరింది.అద్బుతమైన ఈ రికార్డును దక్కించుకుని ఇండియా లోనే మొదటి సినిమా అన్నట్లుగా రికార్డు దక్కించుకుంది.

కరోనా లాక్ డౌన్ తర్వాత ఇండియా వ్యాప్తంగా విడుదల అయిన అన్ని సినిమా ల్లో కేవలం ఉప్పెన మాత్రమే ఇప్పటి వరకు వంద కోట్లను దక్కించుకుంది.బాలీవుడ్‌ తో పాటు ఇతర భాషల్లో విడుదల అయిన ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్‌ అవ్వలేదు.

దాంతో ఉప్పెనకు అరుదైన రికార్డు దక్కింది.లాక్ డౌన్ తర్వాత ఇండియాలో మొదటి వంద కోట్ల సినిమా గా ఉప్పెన చరిత్రలో నిలిచి పోవడం ఖాయం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు