మీర్కాట్ అనే జంతువులు దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తాయి.నిజానికి ఇవి సాధారణ వాటి కంటే కాస్త తక్కువగా ఉండే చిన్న ముంగిసలు.
వీటిని అందరూ మీర్కాట్ అని పిలుస్తారు.ఇవి ఎంత పెద్ద పామునైనా చంపగలవు.
అయితే తాజాగా కేవలం 5 వారాల వయసున్న ఓ ముంగిస అత్యంత భయంకరమైన కేప్ కోబ్రాతో తలపడింది.ఎడారిలో అది ఎలా జీవించాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది.
అయితే దీని శక్తి పాము ముందు చాలా తక్కువ.అందుకే అది వెనకడుగు వేసింది.
కానీ అది పాముని మాత్రం ఊరికే వదిలేయలేదు.
ఈ కుర్ర ముంగిస తాను పెద్ద సమస్యలో ఉన్నట్లు తన కుటుంబానికి సంకేతం ఇచ్చింది.
దాంతో మొత్తం ముంగిసలు దాన్ని రక్షించడానికి పరిగెత్తుకొని వచ్చాయి.పెద్ద ముంగిసలు కేప్ కోబ్రాను ముందు నుంచి దాడి చేయాలని ప్రయత్నించాయి కానీ ఆ పాము చాలా అగ్రెసివ్ గా ఉంది.
ఈ పాము కోరలకు చిక్కితే తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది.అందుకే అవి పెద్దగా రిస్కు చేయకుండా దానిని బాగా భయపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసాయి.
ఈ పాము అదే ప్రాంతంలో తిరిగితే మొత్తం ముంగిసల కుటుంబం ప్రమాదంలో పడుతుంది.అందుకే దీనిని కలిసికట్టుగా మీర్కాట్స్ వెళ్లగొట్టాయి.

నిజానికి ముంగిసలు పాము కాటు వేసినా విషాన్ని తట్టుకొని జీవించగలవు.అందుకే ఈ జంతువులకు పాములు బాగా భయపడుతుంటాయి.నేషనల్ జియోగ్రాఫిక్ యూకే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ ఓల్డ్ వీడియో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ గా మారింది.దీనికి 9.6 మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి.ఈ వీడియోని మీరు 2:50 నిమిషాల నుంచి కూడా వీక్షించండి.







