ఒకే పాముపై ముంగిసల మూకుమ్మడి దాడి.. వీడియో వైరల్..!

మీర్కాట్ అనే జంతువులు దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తాయి.నిజానికి ఇవి సాధారణ వాటి కంటే కాస్త తక్కువగా ఉండే చిన్న ముంగిసలు.

వీటిని అందరూ మీర్కాట్ అని పిలుస్తారు.ఇవి ఎంత పెద్ద పామునైనా చంపగలవు.

అయితే తాజాగా కేవలం 5 వారాల వయసున్న ఓ ముంగిస అత్యంత భయంకరమైన కేప్ కోబ్రాతో తలపడింది.

ఎడారిలో అది ఎలా జీవించాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది.అయితే దీని శక్తి పాము ముందు చాలా తక్కువ.

అందుకే అది వెనకడుగు వేసింది.కానీ అది పాముని మాత్రం ఊరికే వదిలేయలేదు.

ఈ కుర్ర ముంగిస తాను పెద్ద సమస్యలో ఉన్నట్లు తన కుటుంబానికి సంకేతం ఇచ్చింది.

దాంతో మొత్తం ముంగిసలు దాన్ని రక్షించడానికి పరిగెత్తుకొని వచ్చాయి.పెద్ద ముంగిసలు కేప్ కోబ్రాను ముందు నుంచి దాడి చేయాలని ప్రయత్నించాయి కానీ ఆ పాము చాలా అగ్రెసివ్ గా ఉంది.

ఈ పాము కోరలకు చిక్కితే తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది.అందుకే అవి పెద్దగా రిస్కు చేయకుండా దానిని బాగా భయపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసాయి.

ఈ పాము అదే ప్రాంతంలో తిరిగితే మొత్తం ముంగిసల కుటుంబం ప్రమాదంలో పడుతుంది.

అందుకే దీనిని కలిసికట్టుగా మీర్కాట్స్ వెళ్లగొట్టాయి. """/"/ నిజానికి ముంగిసలు పాము కాటు వేసినా విషాన్ని తట్టుకొని జీవించగలవు.

అందుకే ఈ జంతువులకు పాములు బాగా భయపడుతుంటాయి.నేషనల్ జియోగ్రాఫిక్ యూకే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ ఓల్డ్ వీడియో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ గా మారింది.

దీనికి 9.6 మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి.

ఈ వీడియోని మీరు 2:50 నిమిషాల నుంచి కూడా వీక్షించండి.