ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక మొసలి వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో మొసలి బోట్ లో వెళ్తున్న వారిపై దాడికి యత్నించింది.
ఈ వీడియోని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.కాథరిన్ డైబాల్ అండ్ కామెరాన్ బేట్స్ అనే ఛానల్ యూట్యూబ్‌లో ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేసింది.
షేర్ చేసిన సమయం నుంచే దీనికి ఇప్పటికే 1 లక్షా 40వేల వచ్చాయి.ఈ ఘటన ఆస్ట్రేలియాలోని కింబర్లీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే కాథరిన్, కామెరాన్ 15 అడుగుల పొడవైన తమ పడవలో ఫిషింగ్ చేయడానికి నీటిపై తరచుగా తిరుగుతుంటారు.అయితే ఎప్పుడూ కూడా వారు మొసళ్లను ఫేస్ చేయలేదట.
తాజాగా మాత్రం వీరు నీటిలో ఓ చేపని పడుతుండగా ఆ చేపను చూసి ఒక మొసలి వారి బోటు వైపు వచ్చింది.ఆ ప్రెడేటర్‌ను చూసి ఆ జంట భయపడింది.
ఆ మొసలి కొంచెం చిన్నగా ఉండటం తో దానిని ఆట పట్టించడానికి చేపని అటూ ఇటూ తిప్పారు.అప్పటి వరకు చేపపైనే మొసలి దృష్టి ఉంది.
కానీ ఆ తర్వాత అది ఒక్కసారిగా నీటిలో నుంచి ఈ జంట ఉన్న బోటు పైకి ఎగిరింది.అలా మొసలి పడవ పైకి దూకగానే వారికి గుండె ఆగినంత పని అయ్యిందట.
చేప ఎర ద్వారా మొసలిని ఆటపట్టించాలని అనుకున్నామని కానీ ఇది పైకి దూకి మమ్మల్ని బాగా భయపెట్టిందని వీరు పేర్కొన్నారు.

ఈ వీడియో క్లిప్‌లో, ఒక ఉప్పునీటి మొసలి చేపను తినేందుకు పడవ వైపు నీటిలో వేగంగా ఈదుతున్నట్లు చూడవచ్చు.దంపతులు సరస్సు గుండా లాగుతున్న ఫిషింగ్ లైన్‌ను అనుసరిస్తూ మొసలి కనిపిస్తుంది.నీటి నుంచి ఫిషింగ్ లైన్‌ను లాగడంతో మొసలి చేపను పట్టుకోలేకపోయింది.
ఆ తరువాత పడవలోని ఓ మొబైల్ ఫోన్ దాని దృష్టిని ఆకర్షించడంతో అది ఒక క్షణం ఆగిపోతుంది.అనంతరం అది ఫోన్ అందుకునేందుకు పడవ అంచుపైకి ఎక్కింది.
ఒక సెకను పాటు, మొసలి పడవ అంచుపైనే ఉండగలిగింది.అది బోట్ లోపలికి వచ్చినట్లయితే ఈ జంటలో ఎవరో ఒకరు తీవ్రంగా గాయపడి ఉండేవారు.
కానీ మొసలి వారిని చూసి బెదిరి మళ్ళీ కిందకి దిగి వెళ్ళిపోయింది.ఈ షాకింగ్ వీడియోని మీరు కూడా చూసేయండి.







