ప్రణాళిక ప్రకారం పంటల సాగు జరిగేలా చర్యలు: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రణాళిక ప్రకారం పంటల సాగు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రైతు రుణ మాఫీ సన్నద్దత పై బ్యాంకర్లతో రివ్యూ నిర్వహించారు.

జిల్లాలో వ్యవసాయ విస్తీర్ణం, పంటల సాగు, ముఖ్యమైన పంటలు, వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందిస్తున్న సహకారం, ఎరువులు, విత్తనాల లభ్యత, పంటలకు నీటి లభ్యత, రైతు భరోసా, రైతు భీమా, మెకానైజేషన్, రైతు వేదికలు, రైతు నేస్తం వంటి వివిధ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ ఖరీఫ్ పంట సాగు సజావుగా నిర్వహించేందుకు రైతులకు సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు.

క్రాప్ బుకింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు.పత్తి విత్తనాలు ఎక్కడ బ్లాక్ మార్కెట్ కాకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు అవసరమైన ఎరువులు, యూరియా అందుబాటులో ఉండాలని ఎక్కడ బ్లాక్ మార్కెట్ కావద్దని కలెక్టర్ పేర్కొన్నారు.

రైతుల అవసరాల మేరకు ఎప్పటికప్పుడు ఎరువుల స్టాక్ పరిశీలించాలని, ఎక్కడ కొరత రావద్దని కలెక్టర్ అధికారులకు సూచించారు.వ్యవసాయ శాఖ పరిధిలో కూరగాయల సాగు, ఆయిల్ పామ్ సాగు , పండ్ల తోటల పెంపకం మొదలగు లక్షల సాధనకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

Advertisement

రైతు నేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలు , వ్యవసాయ నిపుణులతో రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.రైతులకు మంచి పంట దిగుబడి వచ్చే విధంగా వ్యవసాయ విస్తరణ అధికారులు ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు సూచనలు అందజేయాలని అన్నారు.

రైతు బీమా పథకం కింద నమోదైన రైతులు మరణిస్తే నిర్ణీత కాలంలో వారి కుటుంబానికి రైతు బీమా సహాయం అందేలా చూడాలని అన్నారు.రైతు భరోసా పథకం అమలు సంబంధించి ప్రభుత్వం రైతుల అభిప్రాయాలను సేకరిస్తుందని, క్షేత్ర స్థాయిలో రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్,ఎల్.డి.ఎం.మల్లికార్జున్ సంబంధిత వ్యవసాయ అధికారులు తదితరులు ఉన్నారు.

ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హార్ట్ డే .
Advertisement

Latest Rajanna Sircilla News