విమానంలో భోజనంకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

కరోనా కారణంగా ఇండియాలో విమాన ప్రయాణాలపై దాదాపు రెండు నెలల పాటు నియంత్రణ కొనసాగిన విషయం తెల్సిందే.

లాక్‌ డౌన్‌ సడలింపుల్లో భాగంగా కొన్ని విమానాలకు అనుమతులు ఇవ్వడం మెల్ల మెల్లగా అన్ని విమాన రాకపోకలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం వంటివి జరిగాయి.

అయితే ఎన్నో ఆంక్షల మద్య విమాణ ప్రణాయాలు జరుగుతున్నాయి.కొందరు మాస్క్‌ పెట్టుకునేందుకు నో చెబుతుండటంతో వివాదం తలెత్తింది.

ఇక విమానంలో డ్రింక్స్‌ మరియు ఫుడ్‌ ను అందుబాటులో ఉంచక పోవడంతో ప్రయాణికులు అసౌకర్యంకు గురి అవుతున్నారు.అందుకే కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

ఇకపై జాతీయ మరియు అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికులకు అత్యంత జాగ్రత్తగా ఫుడ్‌ అందించాలని పేర్కొన్నారు.విమానంలో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా మాస్క్‌ ధరించాల్సిందే అంటూ కేంద్రం మరోసారి తెలియజేసింది.

Advertisement

ఎవరైనా మాస్క్‌ పెట్టుకునేందుకు నిరాకరిస్తే వారిని నో ప్లై జాబితాలో చేర్చేందుకు అన్ని సంస్థలకు అనుమతులు ఇవ్వడం జరిగింది.ఇక విమాన ప్రయాణం సమయంలో ప్రతి ఒక్క సిబ్బంది కూడా అత్యంత పరిశుభ్రతను పాటించడంతో పాటు వైరస్‌ ప్రొటక్షన్స్‌ ను ఎప్పటికప్పుడు వినియోగిస్తూ ఉండాలని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.

పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు