అమెరికా చట్టాలను గౌరవించండి.. భారతీయ విద్యార్ధులకు కేంద్రం అడ్వైజరీ

అమెరికాలో అక్రమ వలసదారులను( US Illegal Migrants ) అక్కడి ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భారతీయ విద్యార్ధులు( Indian Students ) కూడా ఉన్నారు.

ఇప్పటికే పలు విడతల్లో భారతీయులను తరలించింది అమెరికా.అలాగే ఇద్దరు భారతీయ విద్యార్ధుల వీసాలను రద్దు వ్యవహారం మరింత దుమారం రేపింది.

ఈ పరిణామాలతో అమెరికాలో ఉన్న భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది.

విద్యార్ధులకు ఏ ఇబ్బందులు ఎదురైనా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్ కార్యాలయాలు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.

Mea Warns Indian Students Against Violating American Laws Details, Mea ,indian S
Advertisement
MEA Warns Indian Students Against Violating American Laws Details, MEA ,Indian S

అయితే వీసాలు మంజూరు/ రద్దు, ఇమ్మిగ్రేషన్ విధానాలు ఆయా దేశాల అంతర్గత వ్యవహారాలని వాటిని పాటించాల్సిన బాధ్యత భారతీయ విద్యార్ధులపైనా ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది.వీసా( Visa ) రద్దును ఎదుర్కొన్న బదర్ ఖాన్, ( Badar Khan ) రంజనీ శ్రీనివాసన్‌లు( Ranjani Srinivasan ) సాయం కోసం అమెరికాలోని ఇండియన్ ఎంబసీని సంప్రదించలేదని కేంద్రం తెలిపింది.ఇటీవల కాలేజీలు, స్కూళ్లు, యూనివర్సిటీలలో నిరసనలపై ట్రంప్ హెచ్చరికలు పంపిన సంగతి తెలిసిందే.

ఆయా సంస్థలకు వెళ్లే ఫెడరల్ నిధులను నిలిపివేయడంతో పాటు ఆందోళనకారులను జైలుకు, వారి స్వదేశాలకు పంపిస్తానని ట్రంప్ హెచ్చరించారు.

Mea Warns Indian Students Against Violating American Laws Details, Mea ,indian S

మరోవైపు.ఇప్పటికే పలు విడతల్లో అక్రమంగా అమెరికాలో ఉంటున్న భారతీయులను ఇండియాకు తరలించగా త్వరలో మరో 295 మందిని పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ మేరకు అక్రమ వలసల అంశంపై పార్లమెంట్‌కు కేంద్ర విదేశాంగ శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.

చట్ట విరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న 295 మంది భారతీయులు త్వరలోనే భారత్‌కు తిరిగి వస్తారని, వారికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు దాదాపు 388 మంది అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో భారత్‌కు పంపిన సంగతి తెలిసిందే.

ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్ల మధ్య భారీ పోటీ నడుస్తుందా..?
గూగుల్‌లో 6 నెలలు.. ఒక ఇంజనీర్ నేర్చుకున్న 6 విలువైన పాఠాలు ఇవే?

అయితే ఇలా వచ్చిన వారి చేతులు, కాళ్లకు సంకెళ్లు ఉండటంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు