వైగో కు ఝలక్ ఇచ్చిన చెన్నై కోర్టు

చెన్నై ఎండీ ఎం కే నేత వైగో కు చెన్నై కోర్టు భారీ ఝలక్ ఇచ్చింది.ఆయనపై నమోదైన దేశ ద్రోహం కేసు కు సంబంధించి ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

2009లో వైకో తన పుస్తకం ‘నాన్ కుట్రమ్ సట్టగిరేన్’ ఆవిష్కరణ కార్యక్రమంలో చేసిన దేశద్రోహ ప్రసంగంతో.ఆయనపై తమిళనాడు పోలీసులు ఐపీసీ సెక్షన్ 124(ఏ) కింద దేశద్రోహం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ కేసు విచారణ నేపథ్యంలో తాజగా చెన్నై కోర్టు దేశ ద్రోహం కేసులో వైగో ను దోషిగా తెలుస్తూ ఈ రోజు తీర్పు వెల్లడించింది.జస్టీస్ జే శాంతి తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఈ కేసులో వైకో ను దోషిగా తేల్చి ఆయనకు ఏడాది సాధారణ జైలు శిక్ష తో పాటు రూ.10 వేలు జరిమానా కూడా విధించింది.

2009లో తమిళ టైగర్లకు మద్దతుగా వైగో మాట్లాడారని పోలీసులు అభియోగం మోపగా, దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనను దోషిగా తెలుస్తూ పై మేరకు తీర్పు వెల్లడించింది.దీనితో వైగో కు జైలు శిక్ష తప్పలేదు.

Advertisement

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

తాజా వార్తలు