పవన్,మాయావతి ల ప్రెస్ మీట్.... విశాఖలో!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీఎస్పీ అధినేత మాయావతి లు కలిసి మీట్ ద ప్రెస్ పేరిట ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇరు పార్టీల అధినేతలు పాల్గొన్నారు.

ఇటీవల బీఎస్పీ పార్టీ తో జనసేన పార్టీ చేతులు కలిపిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఇరు పార్టీ లతో పాటు సీపీఐ,సీపీఎమ్ పార్టీ లు కూడా ఎన్నికల్లో పాల్గొంటున్నాయి.

అయితే త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాయావతి,పవన్ లు కలిసి విశాఖ లో ప్రెస్ మీట్ పెట్టారు.ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.

ఉమ్మడి ఏపీ ని కాంగ్రెస్ అభివృద్ధి చేయలేకపోయింది అని ఆరోపించారు.అలానే ఏపీ కి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అటు కాంగ్రెస్ పార్టీ,ఇటు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ విఫలమైంది అని మాయావతి అన్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ క్రేమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో జతకట్టి ఏపీ కి న్యాయం చేస్తామని మాయావతి హామీ ఇచ్చారు.అలానే ఈ ఎన్నికల్లో బీఎస్పీ,జేఎస్పీ,సీపీఐ,సీపీఎం కూటమి పార్టీ విజయాన్ని అందుకుంటుంది అని పవన్ ఏపీ సి ఎం గా భాద్యతలు చేపడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.అలానే ఈ పార్టీ విజయాన్ని అందుకొని పార్లమెంట్,అసెంబ్లీ లలో అడుగుపెడుతుంది అని ఆమె వ్యాఖ్యానించారు.70 ఏళ్లుగా కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టించుకున్నదే లేదు.అందుకే ఈ కూటమి నుంచి కాంగ్రెస్ వైదొలగింది అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

ప్రజల జీవితాల్లో మార్పు కోసమే పవన్ పోరాడుతున్నారు.ఈ పోరాటంలో పవన్ కు తోడుగా ఉండి ఏపీ రాష్ట్రానికి ప్రజలకు న్యాయం చేస్తామని మాయావతి హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు