ప్రధానమంత్రి రేసులో మాయావతి...ఎవరి సపోర్ట్ తో అంటే ...?

యూపీ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.వచ్చే ఎన్నికల తరువాత యూపీ నుంచే ప్రధాన మంత్రి అభ్యర్థి ఉండాలని ఎస్పీ.

బీఎస్పీ పార్టీలు భావిస్తున్నాయి.మరోపక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాందీని ప్రధానిని చేయాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తుంటే.

యుపిలో ఎస్పి, బిఎస్పి పొత్తు వారి ఆశల మీద నీళ్లు జల్లుతోంది.పైగా ప్రధాని అభ్యర్థిగా.

మాయావతిని బలపరిచేలా ఎస్పి అదినేత అఖిలేష్ యాదవ్ సంకేతాలు ఇస్తున్నారు.

Advertisement

ప్రధానిగా.మాయావతి అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తారా అనే విషయం మీద ప్రశ్నిస్తే‘నేను ఎవరికి మద్దతు ఇస్తానో మీకు తెలుసు.గతంలో యూపీ నుంచి ఒకరు ప్రధానమంత్రి అయ్యారు.

మళ్ళీ ఆ ట్రెండ్ రిపీట్ అయితే సంతోషిస్తాం.తరువాత పీఎం యూపీ నుంచి రావాలి.

అది కూడా కొత్తవారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.దీనిని బట్టి ఆయన మాయావతికి మద్దతు ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు బయలుదేరాయి.

పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..!!

Advertisement

తాజా వార్తలు