మాస్ బొమ్మలే నందమూరి హీరోలకు అచ్చొస్తున్నాయా.. అలా జరగడంతో?

నందమూరి హీరోలకు మాస్ ప్రేక్షకుల్లో ఉన్న అభిమానం అంతాఇంతా కాదు.

గుంటూరు, సీడెడ్ లో మాస్ సినిమాలకు ఉన్న ఆదరణ క్లాస్ సినిమాలకు ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే నందమూరి హీరోలకు క్లాస్ సినిమాలు ఎక్కువగా అచ్చిరావడం లేదు.ఈ హీరోలు మాస్ సినిమాలలో నటించిన సమయంలోనే ఎక్కువగా ఆదరణ దక్కుతోందని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

సాధారణంగా బాలయ్య సినిమాలు అంటే మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటాయి.బాలయ్య మిత్రుడు సినిమాతో పాటు మరికొన్ని క్లాస్ సినిమాలలో నటించారు.

ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుని ఫ్యాన్స్ కు ఒకింత షాకిచ్చాయి.జూనియర్ ఎన్టీఆర్ క్లాస్ మూవీ అయిన నాన్నకు ప్రేమతో సినిమాతో హిట్ అందుకున్నా ఈ సినిమా మరీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కాదనే సంగతి తెలిసిందే.

Advertisement

నా అల్లుడు, ఊసరవెల్లి సినిమాలు క్లాస్ సినిమాలుగానే తెరకెక్కగా ఈ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ప్రస్తుతం తారక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనాలు ఉన్న సినిమాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం గమనార్హం.

కళ్యాణ్ రామ్

కు కూడా క్లాస్ సినిమాలు షాకిస్తున్నాయి.

అమిగోస్ తో కళ్యాణ్ రామ్ కు ఒకింత భారీ షాక్ అయితే తగిలింది.

మాస్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న నందమూరి హీరోలు క్లాస్ సినిమాలతో ఒకింత తడబడుతున్నారు.నందమూరి మాస్ కథలనే ఎంచుకోవాలని అభిమానులు సైతం భావిస్తున్నారు.ఈ కామెంట్ల విషయంలో నందమూరి హీరోల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.

నందమూరి హీరోలు కలిసి నటించే రోజులు కూడా ఉన్నాయని నందమూరి ఫ్యామిలీ భారీ ప్రాజెక్ట్ దిశగా అడుగులు పడాలని నందమూరి అభిమానుల ఆకాంక్ష అనే సంగతి తెలిసిందే.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు