స్వీయ నిర్బంధం ను పాటించని స్టార్ బాక్సర్

కరోనా వైరస్ వ్యాప్తి తో ప్రపంచ దేశాలు అల్లాడుతున్న విషయం తెలిసిందే.రోజు రోజుకు ఈ కరోనా మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.

ప్రపంచ దేశాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ వైరస్ మాత్రం ప్రబలుతూనే ఉంది.భారత్ ఇతర దేశాల నుంచి వచ్చిన వారి లో ఈ వైరస్ ఎక్కువగా ఉంటుంది.

ఈ క్రమంలో విదేశీ ప్రయాణాలు చేసిన వ్యక్తులను 14 రోజుల పాటు క్వారంటైన్(స్వీయ నిర్బంధం) లో ఉండాలి అని ప్రభుత్వలతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సూచిస్తున్నారు.అయితే అలాంటి సూచనలు ఇవ్వాల్సిన ఒక సెలబ్రిటీ నే ఏమాత్రం నియమాలను పట్టించుకోకుండా ప్రవర్తించిన తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారు తప్పని సరిగా స్వీయ నిర్బంధం పాటించాల్సి ఉండగా భారత దేశ దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్ క్వారంటైన్ ను ఉల్లఘించి ప్రవర్తించారు.ఇటీవలే విదేశీ ప్రయాణం చేసి వచ్చిన మేరీ కోమ్ క్వారంటైన్ ను ఉల్లఘించి రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.

Advertisement

ఇటీవలే ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ టోర్నీ కోసం ఆమె జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌ వెళ్లింది.టోర్నీ ముగిశాక ఇటీవలే భారతదేశానికి వచ్చిన ఆమె కేవలం ఐదు రోజులు గడిచాక బాహ్య‌ ప్రపంచంలోకి అడుగు పెట్టడం గమనార్హం.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన విందుకు ఆమె హాజరైంది.ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.

విదేశం నుంచి వచ్చిన తర్వాత 14 రోజుల పాటు స్వీయ‌ నిర్బంధంలో ఉండకుండా, బాహ్య ప్రపంచంలోని కార్యక్రమంలో పాల్గొనడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయితే మేరీ కోమ్ మాత్రం క్వారంటైన్ ముగిసిన తరువాతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను అంటూ తనను తాను సమర్ధించుకున్నారు.ఇక జోర్డాన్ టోర్నీలో పాల్గొన్న మిగతా బాక్స‌ర్లు 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటారని కోచ్‌ వ్యాఖ్యానించారు.మరోపక్క ఇప్పటికే మొత్తం 187 దేశాలకు పాకిన ఈ కరోనా వైరస్ కేవలం 4 నెలల వ్యవధిలోనే 11 వేలమందికి పైగా మృతి చెందగా,దాదాపు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

చైనా లో పుట్టిన ఈ కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తుండగా, ఇప్పుడు ఇక చైనా లో మాత్రం పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు