దారుణం : ఫోన్ చేస్తే భార్య ఎత్తలేదని ఏకంగా గొడ్డలితో...

ప్రస్తుత కాలంలో కొందరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల కారణంగా తమ జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపుకుంటున్నారు.

తాజాగా ఓ వ్యక్తి తన భార్య కు ఫోన్ చేసిన సమయంలో ఆమె తన ఫోన్ కాల్ కి స్పందించలేదనే ఒకే ఒక్క కారణంతో గొడవకు దిగి చివరికి క్షణికావేశంలో ఆమెపై దారుణంగా గొడ్డలితో దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఇక జిల్లాలోని రాజంపేట పరిసర ప్రాంతంలో ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు.అయితే వీరు వృత్తి రీత్యా స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తి మామిడి తోటలకు కాపలాగా ఉంటున్నారు.

అయితే అప్పుడప్పుడు మహిళ భర్త మద్యం సేవిస్తూ ఉండేవాడు.ఈ క్రమంలో ఇటీవలే మద్యం సేవించి తన భార్యకు ఫోన్ చేశాడు.

ఆమె ఇతర పనులలో కొంత బిజీగా ఉండడం వల్ల తన భర్త ఫోన్ కాల్ కి స్పందించ లేకపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి ఆ వ్యక్తి వెంటనే తన ఇంటికి వెళ్లి మద్యం మత్తులో తన ఫోన్ కి ఎందుకు స్పందించలేదని గొడవకు దిగాడు.

Advertisement

దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.మద్యం మత్తులో విచక్షణ కోల్పోయినటువంటి వ్యక్తి తన భార్యను చేతికందిన గొడ్డలితో దారుణంగా గాయపరిచాడు.

ఈ విషయాన్ని గమనించినటువంటి కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాలని  చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం బాధితురాలు చావు బ్రతుకుల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.

అలాగే కుటుంబ సభ్యులు తెలిపినటువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని బాధితురాలి భర్తను పోలీసులు అరెస్టు చేశారు.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు