కందిపప్పు కోసం సర్పంచ్ ని కిడ్నాప్ చేసిన మావోలు

కరోనా నేపధ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోవడంతో పాటు కేవలం ప్రజలకి నిత్యావసర సరుకులు మాత్రమే అది కూడా ఉదయం వేళలో అందుబాటులో ఉంచుతున్నారు.

వీటికి కూడా ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పోలీసుల పర్యవేక్షణలో సరుకులు తీసుకుంటున్నారు.

సాధారణ ప్రజలకే నిత్యావసర సరుకుల కోసం ఇన్ని పాట్లు ఉంటే ఇక అడవిలో మావోల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వారు బయటకి వచ్చి కొనుక్కుంటామంటే ఒకప్పటిలా పరిస్థితి లేదు.

ఎక్కడ చూసిన పోలీసులు కనిపిస్తున్నారు.వారి కళ్ళు కప్పి బయటకి రాలేని పరిస్థితి.

అయితే సరుకులు లేక మావోలు కూడా ఆకలితో ఇబ్బంది పడుతున్నారు.ఈ నేపధ్యంలో ఇప్పటి వరకు ప్రజా ఉద్యమంలో భాగంగా తప్పు చేసిన వారిని, అవినీతి చేసేవారిని మావోయిస్టులు టార్గెట్ చేసి కిడ్నాప్ చేసేవారు.

Advertisement

ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ఉద్యమ లక్ష్యాన్ని పక్కన పెట్టి వారి కడుపు నింపుకోవడం కోసం ఓ సర్పంచ్ ని కిడ్నాప్ చేశారు.ఈ ఘటన ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామంలో జరిగింది.

కందిపప్పు కోసం గ్రామ సర్పంచ్ ని కిడ్నాప్ చేసి, తమకి కావాల్సిన నిత్యావసర సరుకులు అందించాలని, లేదంటే సర్పంచ్ ని చంపేస్తామని బెదిరించారు.దీంతో ఈ విషయం పోలీసుల దృష్టిలో వెళ్ళడంతో వారు రంగంలోకి దిగి కూంబింగ్ స్టార్ట్ చేసారు.

మొత్తానికి ఈ లాక్ డౌన్ పరిస్థితి మావోయిస్టులకి చాలా ఇబ్బందికరంగా మారిందని మాత్రం ఈ సంఘటన బట్టి అర్ధమవుతుంది.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు