మావోల ఘాతకం..25 మంది కిడ్నాప్.. నలుగురి హత్య..!

చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు రెచ్చిపోయారు.సరిహద్దు ప్రాంతాల్లోని రెండు గ్రామాలకు చెంది 25 మందిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.

అనంతరం మావోయిస్టుల ఆధ్వర్యంలో ప్రజాకోర్టును నిర్వహించి అక్కడిక్కడే నలుగురిని హతమార్చారు.ఈ అమానుష ఘటన బీజాపూర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.

ఈ దారుణ ఘటనపై ఇప్పటివరకూ పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే కుర్చేలి, మోటాపాల్ గ్రామాలకు చెందిన 25 మందిని మూడు రోజుల కిందట మావోయిస్టులు కిడ్నాప్ చేశారని సమాచారం.

ప్రజాకోర్టు నిర్వహించి రెండు గ్రామాలకు చెందిన నలుగురిని అక్కడికక్కడే గొంతు కోసి చంపేశారు.వీరిలో ఐదుగురిని విడిచిపెట్టి పదహారు మందిని అదుపులో ఉంచుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇదిలా ఉండగా సోమవారం రాత్రి మరో ఘటన జరిగింది.గూఢాచారి అనే నేపంతో బీజాపూర్ జిల్లాలోని బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుటాకేల్ గ్రామంలోని ఓ గ్రామస్థుడిని కత్తులతో పొడిచి చంపారు.

సోమవారం రాత్రి గ్రామానికి చెందిన దసార్ రమణ ఇంటికి సుమారు ఇరవై మంది వరకు మావోయిస్టులు వచ్చారు.ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న దసార్ రమణను లేపి పని ఉందని చెప్పి బయటకు రమ్మన్నారు.

దీంతో రమణ రానని ఏదైనా ఉంటే ఇక్కడే మాట్లాడమన్నాడు.కుటుంబ సభ్యులు కూడా అడ్డపడటంతో మావోయిస్టులు బలవంతంగా బయటకు లాకెళ్లారు.

అనంతరం ఇనుప రాడ్లతో కొట్టి కత్తులతో పొడిచి చంపారు.చత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు ఇంత మంది ప్రాణాలు తీస్తున్నా పోలీసులు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు