టీడీపీ కీలక నేత‌ల‌పై గురిపెట్టిన బీజేపీ?

ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయ వేడిని చూస్తే ఏ క్షణంలోనైనా ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.

వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార‌, ప్రతిప‌క్షాలు క‌ద‌న‌రంగంలోకి దూకనున్నాయి.

అందుకు తగ్గట్టుగానే వైసీపీ గ‌డ‌ప గ‌డ‌ప‌కు ప్రభుత్వమనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతుంది.ఇక ప్రధాన పక్షంటీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లాల ప‌ర్యటన‌లో బిజీగా ఉన్నారు.

ఇక జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బ‌స్సు యాత్ర మెుదలుపెట్టనున్నారు.ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికలపై ఎంతో కొంత ప్రభావం చూసాలని ప్రయత్నిస్తుంది.

ప్రస్తుతం బీజేపీలో ప్రజలను ఆకట్టుకునే నేతలు లేకపోవడం పార్టీకి పెద్ద మైనస్ పాయింట్‌గా ఉంది.జనసేనతో పోత్తు చివరకు కొనసాగుతుందో లేదని భావిస్తున్న బీజేపీ.

Advertisement

తెలుగుదేశం పార్టీపై గురిపెట్టింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.ఇందుకు కీలక నేతలను ఆ పార్టీలో కలుపుకునేందుకు ప్రయత్నిస్తుంది.

వినే వారిని బుజ్బగించి పార్టీలో చేర్చుకోవడం వినని వారిని సాధు దండోపాయాలను తన దారికి తెచ్చుకోవాలని చూస్తుంది.

ముఖ్యంగా రాయలసీమ నేతలపై బీజేపీ గురిపెట్టింది.జేసీ దివాక‌ర్‌రెడ్డి, జేడీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి కన్నేసింది.వీరిని ఈడీ కాస్త బెదగొట్టి తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తుంది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న జేసీ కుటుంబానికి అనేక దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి దీంతో ఈడీ ఆస్త్రాన్ని ఉపయోగించి వారిని తన దారిలో తెచ్చుకోవాలని చూస్తుంది.తెలుగుదేశం పార్టీలో చెందిన పారిశ్రామిక‌వేత్తల‌తోపాటు, కీలక నేత‌లపై బీజేపీ దృష్టిసారించింది.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జీవన్ రెడ్డి మాల్ రీ ఓపెన్
చంద్రకాంత్ మరణం పై నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్.. నా పరిస్థితి అదేనంటూ?

ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.రాష్ట్ర బీజేపీ నేత‌ల సూచ‌న‌ల మేర‌కు ఎవ‌రెవ‌రు పార్టీలోకి వ‌స్తే బాగుంటుందనే ఢిల్లీ పెద్దలు మాట్లాడుతున్నారు.

Advertisement

వారితో అమితా షా, నడ్డా టచ్‌లోకి వెళుతారని తెలుస్తుంది.అయితే బీజేపీ ఎవ‌రెవ‌రితో మాట్లాడార‌న్నది పూర్తిగా తెలియ‌న‌ప్పటికీ చాలామంది వారి ఆహ్వనాన్ని తిరస్కరిస్తున్నట్లు సమాచారం.

తాజా వార్తలు